https://oktelugu.com/

Devara’ Advance Bookings : మొదలైన ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్..బెన్ఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలిస్తే మీ గుండెలు అదురుతాయి!

ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో హీరో చిత్రం 'దేవర'. ఇక ఏ స్థాయి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంట. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ మేకర్స్ పలు ప్రధాన నగరాల్లో బెన్ఫిట్ షోస్ ని ప్లాన్ చేసారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి,దిల్ సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాలలో బెన్ఫిట్ షోస్ కి ఒక్కో టికెట్ ని 2 వేల రూపాయలకు అమ్మబోతున్నట్టు తెలుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 27, 2024 / 10:26 PM IST

    Devara' Advance Bookings

    Follow us on

    Devara’ Advance Bookings : యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర వచ్చే నెల 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన హడావుడి ఇప్పటి నుండే మొదలు పెట్టేసారు అభిమానులు. సెప్టెంబర్ 27 వ తేదీన అర్థ రాత్రి 1:08 నిమిషాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో షోస్ ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్నారు. సాధారణంగా మొదటి నుండి ఎన్టీఆర్ సినిమా మొదటి రోజు బెన్ఫిట్ షో టికెట్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులు కూడా ఎన్టీఆర్ సినిమా మొదటి రోజు బెన్ఫిట్ షో టికెట్స్ కోసం పోటీ పడుతుంటారు.

    అలాంటిది ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో హీరో చిత్రం ‘దేవర’. ఇక ఏ స్థాయి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంట. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ మేకర్స్ పలు ప్రధాన నగరాల్లో బెన్ఫిట్ షోస్ ని ప్లాన్ చేసారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి,దిల్ సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాలలో బెన్ఫిట్ షోస్ కి ఒక్కో టికెట్ ని 2 వేల రూపాయలకు అమ్మబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి నుండే అభిమానుల నుండి టికెట్స్ కావాలంటూ ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయట. దీనిని బట్టి దేవర మొదటి రోజు వసూళ్లు ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకోండి. రాయలసీమ ప్రాంతం జూనియర్ ఎన్టీఆర్ కి కంచుకోట లాంటిది. ఈ ప్రాంతంలో బెన్ఫిట్ షోస్ కి హద్దులే ఉండవని తెలుస్తుంది. కడప, కర్నూల్, అనంతపురం, చిత్తూరు ఇలా అన్ని రాయలసీమ జిల్లాలలో బెన్ఫిట్ షోస్ నుండి వచ్చే గ్రాస్ నంబర్లు చూస్తే హడలిపోతారంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఉన్న ఊపుని చూస్తుంటే ఈ చిత్రానికి కేవలం సీడెడ్ ప్రాంతం నుండే మొదటి రోజు 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు విడుదలయ్యాయి కానీ, ఒక్క చిత్రానికి కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదు.

    ఒకవేళ దేవర ఆ రేంజ్ ని అందుకుంటే, మళ్ళీ ఆ రికార్డుని ఎన్టీఆర్ తప్ప మరో హీరో కొట్టలేరని అంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ షోస్ పడబోతున్నాయి. ఇప్పటికే లండన్ లో ఒక ఫ్యాన్ షో కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా 3 వేల పౌండ్లు గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్క షో నుండే ఆ రేంజ్ గ్రాస్ వస్తే, ఇక పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన తర్వాత ఏ స్థాయి గ్రాస్ వస్తుందో ఊహించుకోవచ్చు. రాబొయ్యే రోజుల్లో దేవర చిత్రం నుండి మరికొన్ని సంచలన రికార్డ్స్ ని మనం చూడొచ్చు.