https://oktelugu.com/

Devara Movie Collectrions : దేవర’ 2వ రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..గ్రాస్ ని షేర్ గా వేస్తున్న నిర్మాతలు..హిస్టరీ లో ఇలాంటి ఫేక్ ఎప్పుడూ చూసుండరు!

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ నిర్మాతలు సోషల్ మీడియా లో పలు ముఖ్యమైన వెబ్ సైట్లకు వచ్చిన వసూళ్లకంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్టు చూపిస్తూ సోషల్ మీడియా లో అందరి చేత ట్రోల్ల్స్ ఎదురుకునేలా చేసుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 3:36 pm
    Devara Movie Collectrions

    Devara Movie Collectrions

    Follow us on

    Devara Movie Collectrions :  ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ ఇటీవలే విడుదలై మంచి వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ స్థాయి వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ నిర్మాతలు సోషల్ మీడియా లో పలు ముఖ్యమైన వెబ్ సైట్లకు వచ్చిన వసూళ్లకంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్టు చూపిస్తూ సోషల్ మీడియా లో అందరి చేత ట్రోల్ల్స్ ఎదురుకునేలా చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకి నైజాం ప్రాంతం లో రెండవ రోజు 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ నిర్మాతలు ఏకంగా 8 కోట్ల రూపాయిలు వచ్చినట్టు పలు వెబ్ సైట్స్ తో చెప్పించారు. చాలా మంది చెప్పేది ఏమిటంటే నైజాం లో గ్రాస్ ని షేర్ గా చేసి చూపించారని. ఈ స్థాయి ఫేక్ టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. సీడెడ్ లో కూడా ఇదే పరిస్థితి. రెండవ రోజు సీడెడ్ లో ఈ చిత్రానికి 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి,కానీ 3 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టుగా చూపించారు.

    పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన సెంటర్స్ లో 2 వ రోజు వచ్చిన గ్రాస్ వసూళ్లను మొత్తం కలుపుకొని చూసిన కూడా 40 లక్షల రూపాయిలు రాలేదు, కానీ 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టుగా చూపించుకున్నారు. తమాషా ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతీ సెంటర్ 2 వ రోజు పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం ‘దేవర’ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. కానీ ‘దేవర’ చిత్రానికి 48 లక్షల రూపాయిలు వేసి, ‘బ్రో’ చిత్రానికి 29 లక్షల రూపాయిలు వేశారు. ఉత్తరాంధ్ర లో కూడా అదే పరిస్థితి. ఒక్క వైజాగ్ సిటీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం చాలా దారుణమైన వసూళ్లను రెండవ రోజు నమోదు చేసుకుంది.

    కానీ నిర్మాతలు మాత్రం పలు సైట్స్ లో కోటి 96 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టుగా చూపించారు. వాస్తవానికి ఆ ప్రాంతం మొత్తం కలిపి కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో రెండవ రోజు 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే 63 లక్షలు వచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఇలా ఒక్కొక్క సెంటర్ లో యావరేజ్ గా వచ్చిన వసూళ్ల కంటే 50 శాతం ఎక్కువ వేసుకోవడం హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు, కానీ ట్రేడ్ పండితులు అందించే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 14 కోట్ల రూపాయిలు, వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.