
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి బ్రాండ్ ఉంది. హైదరాబాదులో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉండటం.. భూకంపాల తాకిడి ఎక్కువగా లేకపోవడంతో ఈప్రాంతం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచింది. దేశవిదేశాలకు చెందిన ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాయి. ఇప్పటికే ఐటీరంగానికి చెందిన ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాదులో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
Also Read: తండ్రి రాజ్యసభలో.. తనయుడు లోక్ సభలో
దేశంలోని మెట్రో నగరాలకు ధీటుగా హైదరాబాద్ పోటీ ప్రపంచంలో దూసుకెళుతోంది. అయితే హైదరాబాద్ అనేది అందరికీ అందుబాటులో లేదనే సంగతిని ఇక్కడ మనం గుర్తించుకోవాలి. హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాల నుంచి జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నా రాజధానికి చేరుకునేందుకు బోలెడంత సమయం పడుతోంది. ఇతర జిల్లాల నుంచి హైదరాబాదు శివారుకు చేరుకోవడం ఒక ఎత్తయితే.. ఇక హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్య మరో ఎత్తనే చెప్పాలి. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతుండటంతో నగరవాసులు సగం జీవితం రోడ్లపైనే గడిచిపోతున్నాయనే సైటర్లు విన్పిస్తుంటాయి.
ఇకపై అలాంటి కష్టాలు నగరవాసులకు, రాజధానికి వచ్చే ప్రజలకు ఉండబోవని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామ శివారులో మేధా సంస్థ నిర్మించనున్న రైల్ కోచ్ పరిశ్రమకు కేటీఆర్ శంకుస్థాపన చేసిన తర్వాత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక హైదరాబాద్ మహానగరంలో అందరికీ అందుబాటులోకి రాబోతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి ఇకపై కరీంనగర్ కు గంటలో.. విజయవాడకు రెండు గంటల్లో.. బెంగూళూరుకు నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ఇక అతనే సీఎం..?
కేటీఆర్ చెప్పింది హైదరాబాదులో జరగడం సాధ్యమేనా? అనే ప్రశ్న ఎదురవుతుండగా.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ-వారణాసి మధ్య నడిచే వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే సమయం ఎంతో ఆదా అవుతుందని అంటున్నారు. గంటకు 160కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. దీని ద్వారా ఇప్పుడు వీలైనంత తక్కువ సమయంలో జర్నీ పూర్తి కానుంది. దీని ద్వారా ప్రతీఒక్కరు హైదరాబాదులో ఉండి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉండదు. దీనితో హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యకు కూడా చెక్ పడనుంది.
ఈ హైస్పీడు రైళ్లు అందుబాటులోకి వస్తే ఇప్పటివరకు 12గంటల పడుతున్న హైదరాబాద్-బెంగూళూరు జర్నీ కేవలం నాలుగు గంటల్లో పూర్తి కానుంది. అలాగే హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు గంట.. బెజవాడకు రెండు గంటల సమయం పడుతుంది. దీని ద్వారా ఇతర ప్రాంతాలను నుంచి హైదరాబాదుకు రావాలనుకునే వారికి సమయం ఎంతో కలిసిరానుంది. ఇదే జరిగితే హైదరాబాద్ అందరికీ అందుబాటులో రావడం ఖాయంగా కన్పిస్తుంది. సొంతూరు నుంచి హైదరాబాద్ నగరంలో జాబ్ చేయాలనుకునే ఎంతోమంది కలలు సాకారం కానున్నాయి. త్వరలోనే హైదరాబాద్ నయా జర్నీ ప్రారంభం కానుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.