Deshamuduru : కొత్త సినిమాలకంటే ఈమధ్యకాలం లో రీ రిలీజ్ చిత్రాలకు అత్యధిక ఆదరణ దక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందుకే నిర్మాతలు స్టార్ హీరోలకు సంబంధించిన సూపర్ హిట్ సినిమాలను సరికొత్త 4K టెక్నాలజీ కి మార్చి గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘దేశముదురు'(#Desamuduru4k) చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని గతంలో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా స్పెషల్ షోస్ ని నిర్వహించారు. ఇప్పుడు ఈ సినిమాని మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ బాగా వస్తుందని అనుకున్నారు కానీ, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం 6 హౌస్ ఫుల్స్ మాత్రమే నమోదు అయ్యాయి.
గ్రాస్ కనీసం 20 లక్షల రూపాయిలు కూడా లేదు. అయితే పడిన 6 హౌస్ ఫుల్స్ లో ఒకటి హైదరాబాద్ లోని విశ్వనాధ్ థియేటర్. ఈ థియేటర్ లో నేడు అల్లు అర్జున్ అభిమానులు భారీ హంగామా చేశారు. అయితే షో నడుస్తున్న మధ్యలో ఒక పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమాని ‘జిందాబాద్ పవన్ కళ్యాణ్’ అని అరిచాడని, అందుకు చిర్రెత్తిపోయిన అల్లు అర్జున్ అభిమానులు ఆ పవన్ కళ్యాణ్ అభిమాని పై మూకుమ్మడిగా దాడి చేసి, అతన్ని బయటకు గెంటేశారని ఒక వీడియో ని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసి బాగా వైరల్ చేశారు. దీనిపై ఇప్పుడు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. మా సినిమాకు వచ్చి ఇలా కథలు పడితే, ఇదే రిపీట్ అవ్వుద్ది అంటూ అల్లు అర్జున్ అభిమానులు పవన్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read : అల్లు అర్జున్ కాదు దేశముదురు మూవీ ఆ హీరో చేయాల్సింది, అన్నీ ఉండి కూడా ఎదగలేకపోయాడు!
దీనికి పవన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ ‘అసలు మీ సినిమా రీ రిలీజ్ ఉందనే విషయం మీకే పూర్తిగా తెలియదు, ఇక మాకేమి తెలుస్తాది. మీ సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది అని చెప్పుకోవడానికి, ఇలా మీలో మీరే కొట్టుకొని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని కొట్టినట్టు సోషల్ మీడియా లో రుద్దించి, దేశముదురు అనే చిత్రం విడుదల అయ్యింది అని జనాలకు తెలిపే పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఇలాంటి కొట్లాటలు సోషల్ మీడియా వరకే పరిమితంగా ఉంటె మంచిది. బయటకు వెళ్లి ఇలా గొడవలు పడడం కరెక్ట్ కాదు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. హీరోలు మీకు ఏదైనా అయితే మీకోసం ఏమి చేయరు, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అంటూ హితబోధ చేస్తున్నారు.
Viswanath lo kalyan babu ani arisadu kutha pagaldengaru bhaai fans pic.twitter.com/svqvTizX68
— Bharath Reddy (@MB_YSJ_cult) May 10, 2025