Pawan Kalyan : కొన్ని బంధాలను చూసి మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంధాలు, బంధుత్వాలకు విలువలు పోతున్న ఈ కాలం లో కొందరు కోట్ల మంది జనాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో రామ్ చరణ్(Ram Charan), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒకరు. పేరుకే వీళ్లిద్దరు బాబాయ్,అబ్బాయి. కానీ చూసే జనాలకు తండ్రి కొడుకులు లాగా అనిపిస్తారు. అంత గొప్ప ప్రేమ, ఆప్యాయత వీళ్లిద్దరి మధ్య ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి ఒక వేదిక మీద కనిపిస్తే చూసే అభిమానులకు నది ఒక పండుగలా అనిపిస్తుంది. రీసెంట్ గానే వీళ్ళిద్దరిని ఒకే వేదిక మీద చూసే అదృష్టం ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలేస్ ఈవెంట్ ద్వారా దొరికింది. రాజమండ్రి లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లక్షల సంఖ్యలో అభిమానులు పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గురించి, చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి మాట్లాడిన మాటలు ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అభిమానులకు ఈ స్పీచ్ ని సోషల్ మీడియా లో పదే పదే షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ లో ఎవ్వరూ గమనించని ఒక చిన్న సంఘటన సోషల్ మీడియా లో ఒక అభిమాని షేర్ చేయగా, అది వైల్డ్ ఫైర్ లాగా వైరల్ అయ్యింది. ఈవెంట్ జరగుతున్న సమయంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ని కలిసి స్టేజి మీదకు రావాల్సిందిగా యాంకర్ సుమ కోరుతుంది. ఆమె పిలవగానే పైకి లేచేందుకు రామ్ చరణ్ సిద్ధం అవ్వగా, అతని చేతులు పట్టుకొని ఆపుతాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ రెండోసారి పైకి లేచే ప్రయత్నం చేయగా, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆపుతాడు. ఆ తర్వాత ఆయన తన కనుసైగ తో రామ్ చరణ్ మరియు తానూ స్టేజి మీదకు వెళ్లేందుకు సెక్యూరిటీ ని సిద్ధం చేయిస్తాడు.
ఆ తర్వాత పైకి లేచి ఇద్దరు వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో ని చూసిన అభిమానులు పవన్ కళ్యాణ్ కి తన అబ్బాయి రామ్ చరణ్ అంటే ఎంత కేరింగ్ అనేది అర్థం అవుతుంది, ఇలాంటి బాబాయ్ అబ్బాయి బంధాన్ని చూసి అసూయ కలుగుతుంది, మా బాబాయ్ కూడా ఇలా ఉంటే ఎంత బాగుండునో అంటూ నేటికెన్స్ ఈ వీడియో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇకపోతే రేపు ‘గేమ్ చేంజర్’ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తమిళ వెర్షన్ కోసం చెన్నై లో గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అయితే ఈ సినిమాని ఆపాలంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఫిలిం ఛాంబర్ కి కంప్లైంట్ ఇవ్వడంతో రేపు ఈ ఈవెంట్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.