Sankranthiki Vastunnam Trailer Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ (venkatesh) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన ‘ సంక్రాంతికి వస్తున్నాం’ (sankranthiki vastunnam) అనే సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది. ఇక గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ (trailer) అయితే రిలీజ్ చేశారు. ఇక ఆ ట్రైలర్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఈ ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు మొత్తం ఎంటర్ టైమ్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు…ఇక మొదట సీనియర్ నరేష్ కు సంబంధించిన ఒక వ్యక్తి కిడ్నాప్ అవ్వడంతో ఆ కిడ్నాప్ అయిన వ్యక్తిని పట్టుకుని తీసుకురావడానికి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నియమించాలని అనుకుంటారు. దానికోసం మీనాక్షి చౌదరిని ఎంచుకుంటారు. ఇక అప్పటికే పోలీస్ ఆఫీసర్ గా చేసి ఉద్యోగం మానేసి ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకొని పల్లెటూరు లో సెటిల్ అవుతారు వెంకటేష్..ఇక దాంతో తన మాజీ ప్రేమికుడు అయిన వెంకటేష్ తో కలిసి మీనాక్షి చౌదరి ఆ కిడ్నాపర్లను పట్టుకోవడానికి బయలుదేరుతుంది. ఇక అంతలో ఐశ్వర్య రాజేష్ కూడా వాళ్ళతో పాటు బయల్దేరుతుంది. ఇక ట్రైలర్ లో చూపించినట్టుగా మొత్తం వీళ్ళిద్దరి మధ్య వెంకటేష్ నలిగిపోతూ ఉంటాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమా మొత్తాన్ని అనిల్ రావిపూడి తన స్టైల్ లోనే చాలా కామెడీ యాంగిల్ లో తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. మరి సినిమా సగటు ప్రేక్షకుడి ఆకట్టుకునే విధంగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా స్టోరీ ఇంతకుముందు వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 3 సినిమాలో కూడా కిడ్నాప్ డ్రామా అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది.
దాంట్లోని కథనే తీసుకొని మెయిన్ కథగా చేసుకొని ముందుకు తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలోని బేస్ పాయింట్ ని తీసుకొని ఇక్కడ దాన్ని వాడినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికి ఆయన సినిమాలో క్రింజ్ కామెడీ ఉంటుందంటూ చాలామంది కామెంట్ చేస్తూ వస్తున్నారు.
మరి ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే ఇందులో కూడా అలాంటి కామెడీ ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఈ పండక్కి ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని సినిమా టీమ్ అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా రొటీన్ రెగ్యూలర్ ఫార్మాట్లోనే నడుస్తుంది. కాబట్టి సగటు ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించే అవకాశమైతే ఉంటుంది…