Vijay Sethupathi: న‌టుడు విజ‌య్ సేతుపతి పై ప‌రువు న‌ష్టం దావా నమోదు…

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తెలుగులో విడుదలైన మాస్టర్, ఉప్పెన సినిమాలతో విజయ్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన లాభం, ఆనబెల్ సేతుపతి చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేశారు. అయితే సేతుపతిపై బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్య‌క్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 6, 2021 3:42 pm
Follow us on

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తెలుగులో విడుదలైన మాస్టర్, ఉప్పెన సినిమాలతో విజయ్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన లాభం, ఆనబెల్ సేతుపతి చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేశారు. అయితే సేతుపతిపై బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్య‌క్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. తెలుగు, త‌మిళ నాట‌ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అతనిని ఓ వ్యక్తి ఎగిరి తన్నడం ఆయన అభిమానులకు ఎంతో బాధను కలిగించింది. అయితే ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి పై ప‌రువు న‌ష్టం దావా కేసు న‌మోదు అయింది.

విజ‌య్ సేతుప‌తిని తాను ప్ర‌శంస‌లు కురిపించినా… త‌నపై దాడి చేశారని ఆరోపిస్తూ మ‌హా గాంధీ ప‌రువు న‌ష్టం దావా వేశాడు. అయితే మైసూర్ విమానాశ్ర‌యం లో విజ‌య్ సేతుప‌తి ని క‌లిశాన‌ని మ‌హా గాంధీ తెలిపారు. అప్పుడు విజ‌య్ సేతుప‌తి న‌ట‌న గురించి… ఆయ‌న విజ‌యాల గురించి చెప్పాన‌ని అన్నారు. అయినా త‌నపై విజ‌య్ సేతుప‌తి దాడి చేశాడ‌ని తెలిపాడు. విజ‌య్ సేతుప‌తి తో పాటు ఆయ‌న మేనేజ‌ర్ కూడా దాడి చేశాడ‌ని తెలిపాడు. ఈ దాడి లో తాన చెవికి తీవ్ర గాయం అయింద‌ని తెలిపాడు. దీంతో వినికిడి శ‌క్తి కూడా కోల్పోయాన‌ని అన్నాడు. కానీ విజ‌య్ సేతుప‌తి ఈ దాడి విష‌యం లో ఒక క‌ట్టుక‌థ అల్లార‌ని తెలిపారు. అందుకే విజ‌య్ సేతుప‌తి పై ఫిర్యాదు చేశాన‌ని తెలిపాడు. అయితే ఆ వీడియోలో గాంధినే దాడి చేయడం అందరూ చూశారు. క్రేజ్ తెచ్చుకోవడం కోసమే అథ్హను ఇలాంటి పనులు చేస్తున్నాడని విజయ్ సేతుపతి అభిమానులు అంటున్నారు.