Unstoppable Show: నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఒక వైపు ఆయన నటించిన అఖండ సినిమా విడుదల అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఆ తర్వాత గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి తో సినిమాలను లైన్ లో పెట్టారు బాలయ్య. అలానే ప్రస్తుతం ఓటీటీలో కూడా సందడి చేస్తున్నారు బాలయ్య. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ “ఆహా” తో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తున్నారు. హోస్ట్ గా తనలోని మరో టాలెంట్ ను బయట పెడుతూ… దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు బాలకృష్ణ. ఈ టాక్ షో కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ క్రమంలోనే ఈ టాక్ షో కు మొదటి అతిథిగా మంచు మోహన్ బాబు, లక్ష్మీ మంచు, అలాగే మంచు విష్ణు హాజరయ్యి ఎంతో సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించారు. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చి ప్రోగ్రామ్ ను విజయ వంతం చేశారు. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో కి… ఈ వారం స్వయంగా అఖండ సినిమా బృందం వచ్చేసింది. దర్శకుడు బోయబాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్, శ్రీకాంత్, వచ్చారు. అయితే.. తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో ను ఆహా టీం విడుదల చేసింది. ఇక ప్రోమోలో బాలయ్యతో అఖండ టీం చాలా సందడి చేసింది. ఈ ప్రోమో ఎంతో వినోదాత్మకంగా ఉండడంతోపాటు బాలయ్య ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/ahavideoIN/status/1467736506395672577?s=20
హీరోయిన్ ప్రగ్యాతో బాలయ్య స్టెప్పులు వేశారు. అంతేకాకుండా.. యూనిట్ సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడి అలరించారు బాలయ్య. ఇక ఈ షో లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలోనే సందడి చేయనున్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. బాలకృష్ణతో మహేష్ బాబు సరదాగా మాట్లాడుతున్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ ఎపిపోడ్ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది.