Homeఎంటర్టైన్మెంట్Deepika Padukone: పుట్టింటికి దీపికా పదుకొణె.. కారణం ఏంటంటే..

Deepika Padukone: పుట్టింటికి దీపికా పదుకొణె.. కారణం ఏంటంటే..

Deepika Padukone: బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపిక స్వస్థలం బెంగళూరు అనే విషయం చాలామందికి తెలియదు. ఇప్పటికీ ఆమెను ఉత్తరాది యువతని అనుకుంటారు. కానీ ఆమెది దక్షిణాది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఆమె సొంత ఊరు. ఓం శాంతి ఓం సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దీపిక.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో విలక్షణమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో పడిన తర్వాత.. కొంతకాలం అతనితో డేటింగ్ చేసింది. అనంతరం కొన్నేళ్ల క్రితం అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పలేదు. అలాగని గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకోలేదు. ఇటీవల విడుదలైన ఫైటర్ సినిమాలో దీపిక ఏ రేంజ్ లో అందాలను ఆరబోసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టూ పీస్ బి** కి ఆమె సరికొత్త అర్థాన్ని బాలీవుడ్ కు పరిచయం చేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఫైటర్ సినిమా విజయవంతం తర్వాత దీపిక గర్భవతి అని తెలిసింది.. ఇదే విషయాన్ని తన భర్తతో కలిసి ఆమె ప్రకటించింది. ప్రస్తుతం దీపిక చేతిలో ప్రభాస్ హీరోగా రూపు పొందుతున్న కల్కి సినిమా ఉంది. మే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ లో సింగం -2 చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న దీపిక త్వరలో బెంగళూరు వెళ్ళనుంది. ఎందుకంటే తన బిడ్డకు ఆమె అక్కడే జన్మనివ్వాలని భావిస్తోందట. పైగా బెంగళూరు ఆమె పుట్టిన ఊరు కావడంతో.. అక్కడికే వెళ్లాలని దీపిక నిర్ణయించుకుందట. దీపిక ఇష్టానికి అనుగుణంగా ఆమె తండ్రి ప్రకాష్ తన ఇంటిని మార్చుతున్నాడట.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా దీపిక కల్కి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె అప్పటికే గర్భిణిగా తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇప్పటికే తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను దీపిక పూర్తి చేస్తోంది. మరోవైపు ఆమె భర్త రణ్ వీర్ సింగ్ కూడా తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకొని భార్యతోనే ఉండాలనుకుంటున్నాడట. ఎందుకంటే గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీలు భర్తతోనే కలిసి ఉండాలని కోరుకుంటారు. పైగా ఆ సమయంలో భర్త తోడ్పాటు ఆడవాళ్లకు ఎంత అవసరం. అందువల్లే దీపిక మనసు అర్థం చేసుకున్న రణ్ వీర్ సింగ్ త్వరలో బెంగళూరు వెళ్తాడని తెలుస్తోంది. ఇప్పటికే దీపిక కోసం ఇంటిలో ప్రకాష్ పదకొణె సమూల మార్పులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular