Adi Reddy: సోషల్ మీడియా వల్ల చాలామంది జీవితాలు మారిపోతున్నాయనే చెప్పాలి. ఒకప్పుడు పూట గడవని స్థాయి నుంచి ఇప్పుడు ఖరీదైన ఇల్లు, కారు కొనుక్కునే స్థాయి కి వెళ్ళిన బిగ్ బాస్ ఆదిరెడ్డి ని చూస్తే ఇది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆది రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి అందులో బిగ్ బాస్ కి సంబంధించిన రివ్యూలను ఇవ్వడం స్టార్ట్ చేశాడు.
ఇక దాంతో ఆయన చేసిన వీడియోలు ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో ఆయనకి భారీ గుర్తింపు అయితే వచ్చింది. ఇక తను పాపులర్ అవ్వడం తో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఏకంగా కంటెస్టెంట్స్ గా కూడా పాల్గొని భారీ పాపులారిటి ని సంపాదించుకున్నాడు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఉత్సాహంతో బయటకు వచ్చి మరిన్ని వీడియోలు చేస్తూ టాప్ యూట్యూబర్ గా కొనసాగుతున్నాడు. ఇక బిగ్ బాస్ కు సంబంధించిన వీడియోలే కాకుండా ఫ్యామిలీ వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ ఉంటాడు.
ఇక ఇదిలా ఉంటే ఆయన బిగ్ బాస్ సీజన్ సెవెన్ నడుస్తున్న టైం లో నెలకి లక్షల్లో రూపాయలను సంపాదించినట్టుగా తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…ఇక ఇప్పుడు ఆయన ఖరీదైన ఒక భవనాన్ని నిర్మించుకొని అందులోకి గృహప్రవేశం కూడా చేశాడు. ఈ కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించలేదు. ఆయన తన ఫ్యామిలీ తో మాత్రమే గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొక పక్క ఇంటికి సంభందించిన వర్క్ జరుగుతున్నప్పటికీ ఆయన గృహప్రవేశం అయితే చేశారు…
ఇక ఏ స్టేజి నుంచి ఆది రెడ్డి ఏ స్టేజ్ కి వచ్చాడు అనేది తెలుసుకున్న యూత్ అందరూ అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా పైకి ఎదగాలనే ఉద్దేశ్యం తో వాళ్ల రంగాల్లో భారీ కసరత్తులను చేస్తూ కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక లైట్ వెలుగులో ఇల్లు ఇంద్ర భవనంలా ఉంది అంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు దానికి సంభందించిన వీడియో కూడా వైరల్ అవుతుంది…