https://oktelugu.com/

Manas: ఘనంగా బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ భార్య సీమంతం వేడుకలు.. వైరల్ ఫొటోలు

Manas: మానస్ గత ఏడాది నవంబర్ లో వివాహం చేసుకున్నాడు. మానస్ భార్య పేరు శ్రీజ. పెద్దలు కుదిర్చిన సంబంధం అని సమాచారం. బంధు మిత్రుల సమక్షంలో మానస్ వివాహం ఘనంగా జరిగింది.

Written By: , Updated On : July 6, 2024 / 10:50 AM IST
Manas shared his wife baby shower function photos

Manas shared his wife baby shower function photos

Follow us on

Manas: బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ నాగులపల్లి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. ఆయన తండ్రి కాబోతున్నాడు. మానస్ భార్యకు ఘనంగా సీమంతం జరిగింది. ఈ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మానస్ గత ఏడాది నవంబర్ లో వివాహం చేసుకున్నాడు. మానస్ భార్య పేరు శ్రీజ. పెద్దలు కుదిర్చిన సంబంధం అని సమాచారం. బంధు మిత్రుల సమక్షంలో మానస్ వివాహం ఘనంగా జరిగింది. పెళ్ళైన ఏడాది లోపే మానస్ ఫ్యామిలీ ప్లానింగ్ చేశాడు.

మానస్ భార్య శ్రీజ గర్భం దాల్చారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. త్వరలో బేబీ నాగులపల్లి తమ జీవితాల్లోకి రాబోతున్నట్లు కామెంట్ చేశాడు. మానస్ తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మానస్ భార్య శ్రీజ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టు బట్టల్లో శ్రీజ, మానస్ మెరిశారు. శ్రీజ సీమంతం వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. దీంతో వేడుకలో సందడి నెలకొంది. శ్రీజకు పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదించారు.

ఇక మానస్ కెరీర్ పరిశీలిస్తే చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు. అవేమీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. బిగ్ బాస్ సీజన్ 5లో మానస్ పాల్గొన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళాడు.

అనంతరం కార్తీక దీపం సీరియల్ లో నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో లీడ్ రోల్ చేస్తున్నాడు. బ్రహ్మముడి తెలుగులో అత్యధిక టీఆర్పీ సాధిస్తున్న సీరియల్ గా ఉంది. కార్తీక దీపం 2కి మించిన ఆదరణ బ్రహ్మముడి సీరియల్ కి దక్కుతుంది.