Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ఓం శాంతి ఓం’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనే ఆ సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆమె చేసిన మొదటి సినిమానే సూపర్ సక్సెస్ అవడంతో వెను తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక దాంతో పాటుగా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇంతవరకు బాలీవుడ్ లో ఏ హీరోయిన్ తీసుకోలేనంత రెమ్యూనరేషన్ ను దీపిక తీసుకోవడం విశేషము.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె కల్కి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక కల్కి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె తన నిజ జీవితంలో ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక రన్వీర్ సింగ్, దీపికా పదుకొనే ఇద్దరు కొద్దిరోజులు రిలేషన్షిప్ లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అందులో భాగంగానే ఆమె ఇప్పుడు ప్రెగ్నెన్సీ తో ఉన్నారు.
ఇక రీసెంట్ గా కల్కి సినిమా ఈవెంట్ ను కనక మనం చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ అవ్వడం మూలంగా ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఆ ఫంక్షన్ కి వచ్చినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ప్రెగ్నెన్సీ వల్ల దీపికా పదుకొనే ఇకమీదట సినిమాలు చేయలేదు అంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలైతే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆమె రెస్టు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం చేసిన చాలా ప్రమాదం అవుతుంది. ఇక ఇప్పటి వరకు ఆమె కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసింది.
కాబట్టి ఆమె ఇప్పటి నుంచి దాదాపు రెండు సంవత్సరాలపాటు సినిమాలకు దూరం కానున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి డెలివరీ తర్వాత కూడా ఆమె సినిమాలో నటిస్తారా లేదంటే శాశ్వతంగా సినిమాలకు దూరమవుతారా.? అనేది కూడా తెలియాల్సి ఉంది..