Deepika Padukone powerful role in Atlee film : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో ఒక సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో రోజుకి ఒక అప్డేట్ వస్తుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రం లో మొత్తం 5 మంది హీరోయిన్లు ఉంటారని, అందులో ఒకరు దీపికా పదుకొనే(Deepika Padukone) అని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై నేడు అధికారిక ప్రకటన వచ్చింది. అల్లు అర్జున్ పరిచయ వీడియో ని ఎంత గ్రాండ్ గా చూపించారో, దీపికా పదుకొనే పరిచయ వీడియో ని కూడా అంతే గ్రాండ్ గా చూపించారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సూపర్ హీరో క్యారక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే సూపర్ హీరోయిన్ క్యారక్టర్ చేస్తున్నట్టుగా అనిపించింది.
వండర్ ఉమెన్ క్యారక్టర్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్యారక్టర్ షేడ్స్ ని దీపికా పదుకొనే క్యారక్టర్ కి ఆదర్శంగా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అయితే కొంతమంది ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ క్యారక్టర్ చేయడం లేదు, లేడీ విలన్ క్యారక్టర్ చేస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ అవకాశం కూడా లేకపోలేదు, ఎందుకంటే ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒక క్యారక్టర్ నెగటివ్ గా ఉంటుంది. ఆ క్యారక్టర్ కి జోడీగా దీపికా పదుకొనే ఉండొచ్చు. ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ లో హీరోయిన్ రోల్ వస్తే తిరస్కరించి మరీ ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకుంది. చూస్తుంటే చాలా పవర్ ఫుల్ రోల్ దొరికినట్టుగా అనిపిస్తుంది. సరైన పద్దతిలో డైరెక్టర్ అట్లీ ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తే పుష్ప ని మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
The Queen marches to conquer!❤
Welcome onboard @deepikapadukone✨#TheFacesOfAA22xA6▶️ https://t.co/LefIldi0M5#AA22xA6 – A Magnum Opus from Sun Pictures@alluarjun @Atlee_dir#SunPictures #AA22 #A6 pic.twitter.com/85l7K31J8z
— Sun Pictures (@sunpictures) June 7, 2025
ఇకపోతే ఈ సినిమాలో నటించడానికి మృణాల్ ఠాకూర్,జాన్వీ కపూర్ లు కూడా ఒప్పుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లకు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా రెడీ చేసాడు డైరెక్టర్ అట్లీ. త్వరలోనే ఆయన ఇదే తరహా స్టైల్ తో ప్రకటన చేయబోతున్నాడు. ఇక మిగిలిన రెండు హీరోయిన్ క్యారెక్టర్స్ కోసం భాగ్యశ్రీ భొర్సే, దిశా పటాని పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ ప్లానింగ్ ని కూడా చేసుకున్నారు. అంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో చూడొచ్చు అన్నమాట. మరి గ్రాఫిక్స్ ఆధారిత సినిమా, ఇంత తక్కువ సమయంలో ఎలా పూర్తి అవుతుందో చూడాలి.