Deepika Padukone Daughter: మీడియా ముందుకు తొలిసారి దీపికా పదుకొనే కూతురు..త్వరలోనే విడుదల కాబోతున్న సెన్సేషనల్ వీడియో!

అవకాశాలు వస్తున్నాయి కదా అని ఈమె ప్రతీ సినిమా చేసే రకం కాదు, తన పాత్రకు కచ్చితంగా ప్రాధాన్యత ఉండాల్సిందే, లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా ఆమె రిజెక్ట్ చేస్తుంది. అలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ రావడం వల్లే దీపికా పదుకొనే కి ఒక బ్రాండ్ ఇమేజి ఏర్పడింది.

Written By: Vicky, Updated On : October 4, 2024 1:27 pm

Deepika Padukone Daughter

Follow us on

Deepika Padukone Daughter: మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరోయిన్ కి సూపర్ స్టార్ హీరో తో సమానంగా ఓపెనింగ్స్ ఎవరికీ వస్తాయి అని అడిగితే, మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు దీపికా పదుకొనే. షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘ఓం శాంతి ఓం’ చిత్రం ద్వారా ఈమె ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో ఇక దీపికా పదుకొనే కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తూ, హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఈమె ప్రతీ సినిమా చేసే రకం కాదు, తన పాత్రకు కచ్చితంగా ప్రాధాన్యత ఉండాల్సిందే, లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా ఆమె రిజెక్ట్ చేస్తుంది. అలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ రావడం వల్లే దీపికా పదుకొనే కి ఒక బ్రాండ్ ఇమేజి ఏర్పడింది. దర్శక నిర్మాతలు ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు.

ఈమె ప్రధాన పాత్రలో నటించిన కొన్ని సినిమాలు 300 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే దీపికా పదుకొనే ఎక్కువగా రణవీర్ సింగ్ తో సినిమాలు చేసింది. అతన్నే ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. వీళ్లిద్దరికీ రీసెంట్ గానే ఒక పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ఈ దంపతులిద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. గర్భం కారణంగా గత కాలంగా దీపికా పదుకొనే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆమె షూటింగ్స్ తో బిజీ కానుంది. ప్రస్తుతం ఆమె రోహిత్ శెట్టి దర్శకత్వం లో ‘సింగం అగైన్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె లేడీ సింగం గా, పోలీస్ అవతారం లో కనిపించబోతుంది.

ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ టీం ని విడుదల చేయగా దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబై లోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి 2 వేల మంది అభిమానులతో పాటు, ప్రెస్ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ లో అందరి చూపు దీపికా పదుకొనే మీదనే ఉంది. ఎందుకంటే ఆమె ఒక బిడ్డకు జన్మని ఇచ్చిన తర్వాత హాజరు కాబోతున్న మొట్టమొదటి ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ కి ఆమె తన బిడ్డని కూడా తీసుకొస్తుంది అనే టాక్ బాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తుంది. ఇది ఇలా ఉండగా ‘సింగం అగైన్’ చిత్రంలో దీపికా పదుకొనే తో పాటు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కరీనా కపూర్ మరియు టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.