Stock Market: భారత స్టాక్ మార్కెట్‌లో స్వల్ప ఉపశమనం.. రికవరీ అయిన సెన్సెక్స్-నిఫ్టీ

గురువారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు తీవ్ర నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.11 లక్షల కోట్ల ఆవిరైపోయింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,769 పాయింట్ల నష్టపోయి 82, 497 దగ్గర ముగియగా.. నిఫ్టీ 546 పాయింట్లు నష్టపోయి 25, 250 దగ్గర ముగిసింది.

Written By: Mahi, Updated On : October 4, 2024 1:27 pm

Stock Market

Follow us on

Stock Market: భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా(ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం)లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మార్కెట్ అస్తవ్యస్తంగా మారింది. ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. గురువారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు తీవ్ర నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.11 లక్షల కోట్ల ఆవిరైపోయింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,769 పాయింట్ల నష్టపోయి 82, 497 దగ్గర ముగియగా.. నిఫ్టీ 546 పాయింట్లు నష్టపోయి 25, 250 దగ్గర ముగిసింది. భారీ పతనం తర్వాత ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ పై భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త రికవరీ అయి స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన ఒక గంట తర్వాత, స్టాక్ మార్కెట్‌లో దాదాపు ఫ్లాట్ ట్రేడింగ్ కనిపిస్తుంది . దీంతో పెట్టుబడిదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నిఫ్టీలో 25,194.60 స్థాయి కనిపించగా, 55 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్ 82,385 వద్ద ట్రేడవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ కదలిక కాస్త నెమ్మదిగా కనిపిస్తోంది. అయితే ప్రపంచ అనిశ్చితి మధ్య ఇలాంటి వేగం ఉండడం పర్వాలేదనిపిస్తోంది.

సెన్సెక్స్ పరిస్థితి ఏమిటి?
సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 16 పెరుగుదలను, 14 క్షీణతను చూపుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, మారుతీ షేర్లు లాభపడుతున్నాయి. నేడు, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, నెస్లే, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లలో అతిపెద్ద క్షీణత కనిపిస్తోంది.

ఎన్ఎస్ ఈ నిఫ్టీ షేర్ల స్థితి
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ షేర్లను పరిశీలిస్తే 24 షేర్లు లాభపడగా, 26 షేర్లు క్షీణతతో ట్రేడవుతున్నాయి. ఒఎన్‌జిసి, యాక్సిస్ బ్యాంక్, విప్రో, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా పెరిగాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బిపిసిఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, సిప్లా షేర్లు క్షీణించాయి.

స్టాక్ మార్కెట్ అప్‌డేట్ ఏమిటి?
ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్ 61.61 పాయింట్ల స్వల్ప పతనంతో 82,435.49 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17.80 పాయింట్ల నష్టంతో 25,232.30 వద్ద ట్రేడవుతున్నాయి.

మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉంది?
బీఎస్ఈ సెన్సెక్స్ 252.85 పాయింట్ల పతనంతో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభించింది. సెన్సెక్స్‌ 82,244.25 వద్ద ప్రారంభమై నిన్న 82,497.10 వద్ద ముగిసింది. ఇది కాకుండా, నేడు ఎన్ఎస్ఈ నిఫ్టీ 68.20 పాయింట్ల పతనంతో 25,181.90 వద్ద ప్రారంభమైంది. గురువారం 25,250.10 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.