https://oktelugu.com/

Teenmar Mallanna: నాగార్జున హీరో కాదు.. విలన్‌.. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన ఆగ్రహం.. వీడియో వైరల్‌!

తెలంగాణలో కొండా సురేఖ వ్యాఖ్యల వివాదం ఇంకా సమసిపోవడం లేదు. సినిమా నటులు మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతూ ట్వీట్లు చేస్తున్నారు. సురేఖ వ్యాఖ్యలు ఉప సంహరించుకున్నా ఇండస్ట్రీ ఎదురుదాడి ఆగడం లేదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 4, 2024 1:36 pm
    Teenmar Mallanna(1)

    Teenmar Mallanna(1)

    Follow us on

    Teenmar Mallanna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్‌ అయ్యాయి. టార్గెట్‌ కేటీఆర్‌ అవుతాడనుకుంటే.. ఆ వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కోపం తెప్పించాయి. అంతేకాదు.. ఇండస్ట్రీ మొత్తనికి ఇప్పుడు మంత్రి సురేఖ టార్గెట్‌ అయ్యారు. ఎక్స్‌లో పోస్టులతో మంత్రిపై విమర్శల దాడి చేస్తున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా.. వాటిని వెనుకకు తీసుకుంటున్నట్లు ప్రకటించినా.. ఇండస్ట్రీ మాత్రం తగ్గడం లేదు. విమర్శల దాడి కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇండస్ట్రీ తీరుపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌నేత తీన్మార్‌ మల్లన్న కూడా హీరో నాగార్జున టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    నాగార్జున ఫ్యామిలీ ఫైర్‌..
    కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జునతోపాటు ఆయన ఫ్యామిలీ మొత్తం మంత్రిపై ఫైర్‌ అయింది. నాగచైతన్య, అఖిల్, అమల మంత్రిని టార్గెట్‌ చేశారు. నాగార్జున అయితే ఏకంగా కోర్టును ఆశ్రయించారు. పరువునష్టం పిటిషన్‌ దాఖలుచేశారు. మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలను జూనియర్‌ ఎన్టీఆర్, నాని, చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, అల్లు అరుజన్‌తోపాటు పలువురు నటీనటులు, డైరెక్టర్లు తప్పు పట్టారు. రాజకీయాల్లోకి ఇండస్ట్రీని లాగొద్దని కోరారు. కొండా సురేఖ క్షమాపణ కోనినందున ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని పీసీసీ చీఫ్‌ అయినా ట్వీట్లు ఆగడం లేదు.

    తీన్మార్‌ మల్లన్న ఆగ్రహం..
    ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన నాగార్జునపై ఫైర్‌ అయ్యారు. ‘ఒక మహిళా మంత్రి కాబట్టే కాలుదువ్వుతున్నావు కదా.. దువ్వు.. నీ సంగతేంంటో చూస్తాం బిడ్డా..’ అంటూ మండిపడ్డారు. గతంలో నాగారుజన ఎన్‌కన్వెన్షన్‌ కూల్చివేస్తే ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పటికే మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా, తాజాగా తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి.