Ranveer singh & Deepika padukune : బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, రణవీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే దీపిక ప్రెగ్నెన్సీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెకి డెలివరీ డేట్ కూడా ఈ నెలలో ఉందని ముందు నుంచే వార్తలు వచ్చాయి. అయితే అందరూ అనుకున్నట్టు గానే దీపిక రణవీర్ జంట ఆసుపత్రికి బయలుదేరారు. అయితే ఈరోజు వినాయక చవితి దీపిక రణవీర్ ముంబైలో ప్రసిద్ధిగాంచిన ప్రభాదేవి సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. డెలివరీకి ముందు ఆ వినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు. అయితే దీపికా, రణవీర్ చెప్పులు లేకుండా ఈ వినాయకుని దర్శించుకోవడానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో వినాయకుని దర్శించుకోవడానికి వెళ్లారు. రణవీర్ దీపిక చేయి పట్టుకుని జాగ్రత్తగా ఆమెని ఆలయం దగ్గరికి తీసుకువెళ్లాడు. అయితే ఇద్దరూ నడుచుకుని వెళ్తుంటే.. అందరూ దీపిక జంటను చూడటం మొదలుపెట్టారు. బేబీ పంప్ తో వినాయకుని దర్శించుకోవడానికి వచ్చిన అక్కడ దీపిక స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు.
దీపిక పచ్చని చీర కట్టుకుని, చెప్పులు ధరించకుండా గణపతిని దర్శించుకోవడానికి వెళ్లడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. గణపతిని దర్శించుకున్న తర్వాత దీపిక ఆసుపత్రికి బయలుదేరారు. దీనికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అయితే డాక్టర్లు ఆమెకి ఈ నెల 28వ తేదీన డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే డెలివరీ సమయానికి దీపిక తో ఉండాలని రణవీర్ షూటింగ్ అన్ని క్లోజ్ చేసుకుని తనకి తోడుగా ఉన్నారు.
దీపికా పదుకొనే, రణవీర్ 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే దీపిక ప్రెగ్నెన్సీ అని ఫిబ్రవరిలో ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే దీపిక ప్రెగ్నెన్సీ అబద్ధమని సోషల్ మీడియాలో ఎక్కువగా పుకార్లు కూడా వచ్చాయి. వీటి అన్నిటికి దీపిక చెక్ పెడుతూ.. బేబీ పంప్ ఫొటో షూట్ కూడా చేశారు. దీంతో ఆమె అందరి నోర్లు ముహించింది. అయితే దీపిక నటించిన కల్కి 2898 ఏడీ ఇటీవల విడుదల అయ్యి రికార్డులు సృష్టించింది. బేబీ పంప్ తోనే దీపిక మూవీ ఈవెంట్స్ కి కూడా వచ్చింది. అయితే ఇకపై దీపిక కొన్ని రోజులు షూటింగ్ సినిమాలకి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. దాదాపుగా 2025 వరకు షూటింగ్ కి వెళ్లకుండా పుట్టే బిడ్డతో ఉండనున్నట్లు సమాచారం.
మరి ఇందులో నిజం ఎంతో తెలీదు. ఇదిలా ఉండగా దీపికకి తప్పకుండా పాప పుడుతుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే మరి పుట్టేది బాబు లేదా పాప తెలియాలంటే అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.