https://oktelugu.com/

China : చైనాలో మనుషులు కొట్టుకుపోయారు.. యాగీ బీభత్సం వీడియో వైరల్‌!

డ్రాగన్‌ కంట్రీ చైనాలో ప్రకృతి ఈ ఏడాది బీభత్సం సృష్టిస్తోంది. తుపానులు, పెను గాలుల ధాటికి చైనా అతలాకుతలం అవుతోంది. ఆస్తులు, ప్రాణ నష్టం జరుగుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 7, 2024 / 08:47 PM IST

    China.. Video of Yagi disaster

    Follow us on

    China : చైనాను ఈ ఏడాది ప్రకృతి పగబట్టినట్లే ఉంది. జనవరి నుంచి వరుసగా వర్షాలు, ఎండలు, గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏడాది ఆరంభంలో వరదలు చైనాను ముంచెత్తాయి. ఇక మార్చి, ఏప్రిల్‌నెలల్లో ఎండలు దంచికొట్టాయి. 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలులకు చాలా మంది చనిపోయారు. ఇక జూన్‌ నుంచి చైనాలో వర్షాలు, బలమైన గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూలైలో ఓ భవంతికి గ్లాస్‌ మైంటైన్‌ చేస్తున్న కార్మికులు పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా బీభత్సమైన గాలి రావడంతో గాలిలో తేలేడుతున్న వీడియో వైరల్‌గా మారింది. బీజింగ్‌ నగరంలో బలమైన గాలుల కారణంగా కొంతమంది గాజు గ్లాస్‌ మెయింటనెన్స్‌ వర్కర్లు బిల్డింగ్‌ బయట వేలాడుతున్నట్లుగా వైరల్‌ వీడియోలో కనబడుతుంది.బిజీ నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం ఉరుములు, మెరుపులు అలాగే పిడుగులు కలిసిన వర్షం పెను విధ్వంసాన్ని సృష్టించింది. కియాన్లింగ్‌ షాన్‌ పర్వతం వద్ద 37.2 మీటర్ల వేగంతో సెకండ్కు గాలులు విచాయి.ఇది ఓ టైఫూన్‌ బలానికి సమానమని వాతావరణ అధికారులు తెలియజేశారు.

    234 కి.మీల వేగంతో గాలులు..
    తాజాగా చైనాలో యాగి తుపాన్‌ బీభత్సం సృష్టించింది. తుపాన్‌ ప్రభావంతో గంటకు 234 కి.మీ వేగాన్ని మించి బలమైన గాలులు వీచాయి. దీంతో, వాహనాలతో సహా మనుషులు కొట్టుకుపోయాయి. పలుచోట్ల రేకుల షెడ్స్‌ గాల్లోకి ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తీవ్ర తుపాను కారణంగా రెండు రాష్ట్రాల్లోని నదులకు వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. తుపాను నేపథ్యంలో హైనాన్‌ రాష్ట్రంలో వెంగ్లియాన్‌ టౌన్షిప్‌ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించవచని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. హైనాన్లోని నాండు, చాంగువా నదులకు వరద ముప్పుందని ప్రజలను అలర్ట్‌ చేసింది.

    సురక్షిత ప్రాంతాలు 5.70 లక్షల మంది..
    తుపాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గౌంగ్‌ంగ్లో 5.70 లక్షలమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజా తుపానుపై చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. యాగీ తుపాన్‌ కారణంగా దాదాపు 8 లక్షల ఇళ్లకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. తుపాన్‌ కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. 92 మంది గాయపడినట్టు చైనా ప్రభుత్వం చెబుతోంది. మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, యాగీ తుపాన్‌ ప్రభావం ప్రస్తుతం వియత్నం మీద కూడా ఉంది. అక్కడ కూడా ఎడతెరపిలేని వర్షం కురుస్తూ భీకర గాలులు విస్తున్నాయి.