https://oktelugu.com/

అసద్‌కు డీఎంకే పిలుపు..: అందుకేనట

మహానాడులో పాల్గొనాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీకి ఆహ్వానం అందిందట. అయ్యో.. మహానాడు అంటే అదేదో టీడీపీ ప్రోగ్రాం అనుకునేరు. కానేకాదు.. ఈనెల 6వ తేదీన చెన్నైలో జరగబోతున్న డీఎంకే మహానాడులో పాల్గొనాలని ఆహ్వానం వచ్చిందంట. మొన్నటి బీహార్‌‌ ఎన్నికల్లో ఎంఐఎం మంచి ఫలితాలు సాధించడంతో ఆ రాష్ట్రంలోనూ ఆ పార్టీకి మంచి గుర్తింపు లభిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది. Also Read: ‘నమో’ ఆశీర్వాదం […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 4, 2021 / 02:10 PM IST
    Follow us on


    మహానాడులో పాల్గొనాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీకి ఆహ్వానం అందిందట. అయ్యో.. మహానాడు అంటే అదేదో టీడీపీ ప్రోగ్రాం అనుకునేరు. కానేకాదు.. ఈనెల 6వ తేదీన చెన్నైలో జరగబోతున్న డీఎంకే మహానాడులో పాల్గొనాలని ఆహ్వానం వచ్చిందంట. మొన్నటి బీహార్‌‌ ఎన్నికల్లో ఎంఐఎం మంచి ఫలితాలు సాధించడంతో ఆ రాష్ట్రంలోనూ ఆ పార్టీకి మంచి గుర్తింపు లభిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది.

    Also Read: ‘నమో’ ఆశీర్వాదం తీసుకున్న రజనీ..!

    అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి రెండు నియోజకవర్గాల్లో గెలిచింది. వచ్చే మేలో జరగబోతున్న తమిళనాడులోనే పోటీ చేయాలని డిసైడ్‌ అయింది. అయితే.. కమలహాసన్‌ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యుం (ఎంఎన్ఎం) పార్టీతో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ మధ్యనే సమావేశం అయ్యారు. ఇరు పార్టీలు కలిసి పనిచేసేందుకు చర్చలు జరిగి ఉన్నట్లు అందరి అంచనా. అయితే వాళ్లిద్దరి భేటీ విషయాలు మాత్రం ఇంకా బయటకురాలేదు.

    Also Read: రజనీకాంత్ మద్దతు ఆ పార్టీకేనా?

    ఇంతలోనే డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ నుండి అధికారికంగా అసదుద్దీన్‌కు ఆహ్వానం అందటం గమనార్హం. ఇటు కమలహాసన్ అటు స్టాలిన్‌లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే సందిగ్ధం నెలకొంది ప్రస్తుతం. అయితే.. అసద్‌ మాత్రం కచ్చితంగా డీఎంకేనే ఎంచుకుంటారని ప్రచారం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావటం గ్యారంటీ అనే ప్రచారం ఇప్పటికే అక్కడ ఊపందుకుంది. కాబట్టి అధికారంలోకి వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకోవటానికే ఏ పార్టీ అయినా సహజంగా మొగ్గు చూపుతుంది. సో.. అందుకే ఎంఐఎం కూడా ఆ దిశగా మొగ్గుచూపే అవకాశాలే కనిపిస్తున్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    డీఎంకే ఆహ్వానంతో అసద్ 6వ తేదీన చెన్నైకి చేరుకుంటారని సమాచారం. తర్వాత పొత్తులపై చర్చించనున్నారట. కాకపోతే ఎన్ని సీట్లలో ఎంఐఎం పోటీ చేసేది స్టాలిన్ పైనే ఆధారపడి ఉంది. మరోవైపు ఎంఐఎం వర్గాల సమాచారం ప్రకారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అసద్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.