Homeఎంటర్టైన్మెంట్Dear Megha Telugu Movie  Review :   'డియర్ మేఘ'  రివ్యూ

Dear Megha Telugu Movie  Review :   ‘డియర్ మేఘ’  రివ్యూ

నటీనటులు:  మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్,  అర్జున్ సోమయాజుల, పవిత్రా లోకేష్  తదితరులు

దర్శకత్వం:  ఏ . సుశాంత్ రెడ్డి
స్క్రీన్ ప్లే :  ఏ . సుశాంత్ రెడ్డి
నిర్మాత:  అర్జున్ దాస్యన్,
సంగీత దర్శకుడు :  గౌర హరి,
సినిమాటోగ్రఫీ: ఆండ్రూ

డిఫరెంట్‌ లవ్  కాన్సెప్ట్‌ తో  మేఘా ఆకాష్ (Megha Akash), ఆదిత్ అరుణ్ (Adith Arun),  అర్జున్ సోమయాజుల (Arjun Somayajula)  ప్రధాన పాత్రల్లో   వచ్చిన సినిమా   ”డియర్ మేఘ”(Dear Megha).   అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు.  కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ  ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం   ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

కథ : 

మేఘా స్వరూప్ (మేఘా ఆకాష్)  కాలేజీలో తన సీనియర్  అర్జున్ (అర్జున్ సోమయాజుల)ను ప్రేమిస్తుంది. కాకపోతే ఆమెది మూగమనసులు నాటి ప్రేమ. దాంతో మేఘా తన ప్రేమను వ్యక్త పరచలేక   తనలో తానే మిక్కిలీ  మదన పడుతూ సక్సెస్ ఫుల్ గా నలభై నిమిషాల సినిమాను ముందుకు నడిపింది.  ఈ లోపు దర్శకుడు మూడేళ్లు ముగిశాయి అని ఒక చిన్న కార్డు వేసుకున్నాడు.  మూడేళ్లు తర్వాత  అర్జున్  మేఘ జీవితంలోకి వచ్చి.. నేను నిన్ను కాలేజీ రోజుల నుంచే   ప్రేమిస్తున్నా అంటాడు. దాంతో   ఇద్దరి పరిస్థితి ఒకటే అని  అర్థమవుతుంది.  ప్రేమ మొదలవుతుంది. అంతలో ఓ  పెద్ద  ప్రమాదం.

మేఘ జీవితం ఊహించిన మలుపు తిరుగుతుంది.  ఆ పరిస్థితుల్లో మేఘాను  అనుకోకుండా  కలుస్తాడు  ఆది (ఆదిత్ అరుణ్).  మేఘా  – ఆది మధ్య స్నేహం మొదలవుతుంది.    అతని స్నేహంలో మేఘా మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఈ లోపు వీరిద్దరూ  ప్రేమలో పడతారు.  ఇక  ఈ ప్రేమ విజయవంతం అవుతుంది అనుకునేలోపు   నేను ఇంకా ఉన్నాను అంటూ అర్జున్  మళ్లీ  ఎంట్రీ ఇస్తాడు.  దాంతో మళ్ళీ మేఘా జీవితం మరో  మలుపు తీసుకుంటుంది.  చివరకు మేఘా – ఆది కథ ఎలా ముగిసింది ? ఈ మధ్యలో ఏమి జరిగింది ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో  నటించిన  మేఘా ఆకాష్  తన నటనతో  ఆకట్టుకుంది. ప్రేమ  సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో   తన పెర్ఫార్మెన్స్ తో  ఆమె మెప్పించింది.  ఇక హీరోగా నటించిన  ఆదిత్ అరుణ్   తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా  బాగున్నాడు.   సరదాగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో..  తన రియలిస్టిక్ యాక్టింగ్ తో  ఆకట్టుకున్నాడు.   ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో  సాగే కొన్ని  సరదా సన్నివేశాల్లో గాని, అలాగే సెకెండ్ హాఫ్ లో హీరోయిన్ కి తన ప్రేమను తెలియజేసే  సన్నివేశంలో గాని ఆదిత్  చాలా చక్కగా నటించాడు.

తన తల్లి పవిత్రా లోకేష్ పాత్ర  చనిపోయే సీన్స్ లో కూడా  అతని నటన  చాలా బాగుంది.  అలాగే మరో కీలక పాత్రలో నటించిన అర్జున్ సోమయాజుల  కూడా పర్వాలేదు.  ఇక మిగిలిన నటీనటులు కూడా  తమ పాత్ర పరిధి మేరకు  బాగానే చేసారు.  ఇక సినిమాలో  కొన్ని  భావోద్వేగ సీన్స్ కూడా బాగున్నాయి.  అయితే  దర్శకుడు ఏ . సుశాంత్ రెడ్డి  ప్రేమకు  సంబంధించి  మంచి  స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ,  ఆ లైన్ ను  పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాలను  రాసుకోలేదు.
YouTube video player
హీరో హీరోయిన్ల  మధ్యన వచ్చే ప్రేమ మరియు  సంఘర్షణ  తాలూకు సన్నివేశాలు కూడా  పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు.  దీనికి తోడు  సినిమాలో కొన్ని  కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా  అనిపిస్తాయి తప్ప,  ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు.  కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ..  పేలవంగా సినిమాని మలిచారు.

ప్లస్ పాయింట్స్ :
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్  నటన,
కథ,
నేపథ్య సంగీతం,
కొన్ని ఎమోషనల్  సీన్స్,
చివర్లో వచ్చే ట్విస్ట్.

మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ప్లే,
రొటీన్ డ్రామా,
హీరోయిన్ ఫస్ట్ లవ్  ట్రాక్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
అన్నిటికి మించి స్లో నేరేషన్.

సినిమా చూడాలా ? వద్దా ? 

రొటీన్ లవ్  డ్రామా అంశాలతో సాగినా.. ఈ  సినిమాలో ఎమోషనల్ గా  సాగే  లవ్  సీన్స్ ఆకట్టుకుంటాయి.  అలాగే నటీనటుల నటన కూడా బాగుంది. కానీ,  మిగిలిన బాగోతం అంతా  బోరింగ్ వ్యవహారమే.  మొత్తమ్మీద ఫీల్ గుడ్ లవ్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

oktelugu.com రేటింగ్ : 2.25

Dear Megha Official Trailer | Adith Arun, Megha Akash | Sushanth Reddy | September 3rd Grand Release

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version