Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో బాగా డ్రామాలు ఆడుతూ కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ మణికంఠ మాత్రమే. ఇతని నిజ స్వరూపం ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ‘ఇతనికి ఓట్లు ఎలా వేస్తున్నారు రా బాబు’ అని అనుకోక తప్పదు. ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ టాస్కు లో నా క్లాన్ లో ఉన్న వాళ్ళే నన్ను తీసేసారు, నేను ఎలాంటి త్యాగం చేయలేదు అంటూ వాదించి తెగ గోల చేసాడు మణికంఠ. కానీ గ్రూప్ గా అందరూ కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకునే ముందే మణికంఠ నిఖిల్ తో నేను గేమ్ నుండి తప్పుకోవాలని అనుకుంటున్నాను అంటూ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నేను తప్పుకుంటాను అని మణికంఠ చెప్పినప్పుడు నిఖిల్ అతన్ని ఆలోచించుకోమని చాలా వరకు చెప్పాడు. ఆ వీడియో లో అసలు ఏముందో చూద్దాం.
ముందుగా మణికంఠ నిఖిల్ వద్దకు వెళ్లి మాట్లాడుతూ ‘వైల్డ్ కార్డ్స్ ని అడ్డుకోవడం, ప్రైజ్ మనీ ని గెలవడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో నేను ఆడడం మంచిది కాదు. మన టీం గెలుపు కోసం నేను తప్పుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు మణికంఠ. అప్పుడు నిఖిల్ మాట్లాడుతూ ‘ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నీ గేమ్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది,ఆలోచించుకో’ అని అంటాడు. అప్పుడు మణికంఠ ‘నా స్వార్థం గురించి ఆలోచిస్తే మన టీం ముందుకు పోదు. ఇప్పుడు ఏదైనా భయంకరమైన ఫిజికల్ టాస్క్ వస్తే నేను న్యాయం చేయలేకపోవచ్చు. నా కంటే మీరందరు ఫిజికల్ గా బాగా స్ట్రాంగ్. అందుకే నేను తప్పుకుంటాను. నేను నా పాయింట్ ని పెట్టాను, చీఫ్ గా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. ఒకవేళ నన్ను తీసేస్తే నేను నీ మీద ఎలాంటి ఆరోపణలు చేయను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత మాట్లాడిన మణికంఠ మళ్ళీ గ్రూప్ లో నలుగురితో కూర్చొని మాట్లాడేందుకు పాల్గొంటాడు. సోనియా, యష్మీ లతో చాలాసేపు వాదిస్తాడు.
అప్పటికే నిఖిల్ దగ్గర నేను తప్పుకుంటాను అని తనకి తానుగా ముందుకొచ్చిన మణికంఠ, ఇప్పుడు మళ్ళీ వాదించడం ఎందుకు, అక్కడ అంత సీన్ చేయడం ఎందుకు. ఆ తర్వాత సీత క్లాన్ వాళ్ళు కావాలని మణికంఠ ని తప్పించారు అని ఆరోపణలు చేస్తే నిఖిల్ వాళ్లకు సమాధానం చెప్తూ ‘స్వయంగా వాడే తప్పుకుంటాను అని నా దగ్గరకు వచ్చి చెప్పాడు’ అని అంటాడు. దీనిని సీత క్లాన్ లో ఉన్నోళ్లు ఎవ్వరూ నమ్మరు. దానిని మణికంఠ ఇంకా పెద్ద డ్రామా చేసి, మైక్ విసరగొట్టి ఎదో వాళ్ళు బలవంతం చేయడం వల్ల నేనే చేశాను అని ఒప్పుకున్నట్టుగా అందరినీ నమ్మించాడు. ఇంత దారుణమైన మ్యానిపులేటర్ ని ఎక్కడైనా చూసుంటామా?, ఇతను చేసే పనికిమాలిన పనులకు హౌస్ మేట్స్ అందరూ నామినేట్ చేస్తే ‘ఒక్కడిని చేసి అందరూ టార్గెట్ చేసారు’ అని ఆడియన్స్ అనుకోని అతనికి ఓట్లు వేయడం ఇంకా పెద్ద కామెడీ. జనాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారో లేదో.
Rey Pokiri Range Twist #Manikanta Em Matladuthunnav Ayya Nuvve Sacrifice Chesi,Malli Nuvve Danni Issue Chesi
Malli Danni Symp*thy Ga VadukuntunnavAnipistundi Naku Ayithe #BiggBossTelugu8pic.twitter.com/wH1GYicIao
— BiggBossTelugu8 (@Boss8Telugu) September 30, 2024