Deadpool And Wolverine: హాలీవుడ్ స్క్రీన్ మీద ఎలాంటి సినిమా వచ్చిన కూడా ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉండటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాలు భారీ కలెక్షన్లను రాబడుతుంటాయి. నిజానికి హాలీవుడ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రతి దేశంలో మిగతా సినిమాలన్ని కూడా వాళ్ల సినిమాల రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాయి. ఇక ఈ సినిమాల మీద ఆయా దేశ ప్రజలు చూపించే ఇంట్రెస్ట్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా హాలీవుడ్ సినిమాలని ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అందరూ చేసే అడ్వెంచర్ ఫీట్స్ గాని, విజువల్స్ గాని ప్రేక్షకులను కట్టిపడేయడంలో చాలా వరకు సక్సెస్ అవుతాయి. అందువల్లే ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమాని ఎక్కువగా చూడ్డానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు…ఇక అందులో భాగంగానే ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ అనే సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా కోసం దాదాపు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ క్యారెక్టర్లు చాలా ఇంపాక్ట్ ను క్రియేట్ చేయడమే కాకుండా ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఎదురుచూసెంతలా ఈ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా మీద మంచి అంచనాలను పెంచుతుంది.
ఇక ఈ సినిమా జూలై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటం విశేషం…ఇక దానికి అనుకూలంగానే తెలుగులో ఉన్న వీరాభిమానులు సైతం ఈ సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి అలాంటి వారందరిని సాటిస్ఫై చేయడానికి ఈ సినిమా ఎలాంటి స్ట్రాటజీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ట్రైలర్ మాత్రం చాలా ఎంగేజింగ్ గా చూపించారు. డీడ్ పూల్ అండ్ ఉల్వరిన్ ఇద్దరూ కూడా ప్రత్యర్థులపైన విరుచుకుపడుతున్న యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా గ్రాండ్ గా చిత్రీకరించినట్టుగా కనిపిస్తుంది. ప్రతి షాట్ కూడా వైల్డ్ గా ఉండడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది. ఇక జూలై 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఇండియాలో ఎంత వసూళ్లను కలెక్ట్ చేస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ఈ సినిమాకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. అయితే మేజర్ సిటీస్ లో మాత్రమే ఈ సినిమాను ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక టౌన్ లలో ఈ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు..కాబట్టి సిటీలోనే ఈ సినిమాకి ఎక్కువగా ఆదరణ లభిస్తుంది.కాబట్టి వాళ్ళు సిటీలోనే సినిమాని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో జులై 26వ తేదీన పెద్ద సినిమాలు ఏవి రావడం లేదు. కాబట్టి ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాతో హాలీవుడ్ మరోసారి భారీ ప్రయోగం చేస్తుంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా అనేదే తెలియాల్సి ఉంది…