Movie Review : హాట్ స్పాట్ మూవీ ఫుల్ రివ్యూ…

ఇద్దరు ప్రేమించుకున్న యువ జంట పెళ్లి చేసుకొని తమ లైఫ్ ను లీడ్ చేయాలని అనుకుంటారు. కానీ అనుకోని కారణాలవల్ల అమ్మాయి అబ్బాయిగా, అబ్బాయి అమ్మాయి గా మారితే ఎలా ఉంటుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ కథను తనకు చెప్తాడు. దాంతో బాలామణి చాలా ఎగ్జైట్ అయిపోయి ఈ కథ బాగుంది. కానీ సినిమాకి సరిపోదేమో అని అంటాడు.

Written By: Gopi, Updated On : July 22, 2024 12:58 pm
Follow us on

Movie Review : ప్రస్తుతం ఇండియాలో ఏ సినిమా ఇండస్ట్రీని చూసుకున్న కూడా వైవిధ్యమైన కథాంశాలు మాత్రమే చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఇలానే ఈ సినిమాలను చూస్తూ ఆదరిస్తున్నారు. అందువల్లే ఎక్కువమంది చిన్న హీరోలు చిన్న దర్శకులు ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తున్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఒక చిన్న సినిమా తమిళం లో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రస్తుతం ఓటిటిలో కూడా సందడి చేస్తుంది. ఆ సినిమా ఏంటి అంటే ‘హాట్ స్పాట్’… ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది.? ఈ సినిమాను వీక్షించే విధంగా ఉందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ప్రముఖ నిర్మాత అయిన కే జే బాలామణి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఒక మంచి కథని సినిమాగా తీయాలని అనుకుంటాడు. ఇక అందులో భాగంగానే చాలామంది దర్శకులు చెప్పే కథలను వింటున్నప్పటికీ ఆయనకు ఏ కథ కూడా కనెక్ట్ అవ్వదు. దాంతో ఇక సినిమాలు తీయడం వేస్ట్ అనే ఒక నిర్ణయానికి వస్తాడు. దాంతో సరిగ్గా అదే సమయానికి మహమ్మద్ షఫీ (విఘ్నేష్ కార్తీక్) బాలామణి గారికి ఒక కథ చెప్పడానికి వస్తాడు. ఇక అప్పటికే పలు రకాల కథలను విని విసిగిపోయిన ఆయన షఫీ కి కేవలం పది నిమిషాల సమయం మాత్రమే ఇస్తాను. ఈ పది నిమిషాల్లో నువ్వు చెప్పాల్సిన కథను చెప్పేసేయమని అంటాడు. ఇక దాంతో షఫీ కథ చెప్పడం స్టార్ చేస్తాడు…

ఇద్దరు ప్రేమించుకున్న యువ జంట పెళ్లి చేసుకొని తమ లైఫ్ ను లీడ్ చేయాలని అనుకుంటారు. కానీ అనుకోని కారణాలవల్ల అమ్మాయి అబ్బాయిగా, అబ్బాయి అమ్మాయి గా మారితే ఎలా ఉంటుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ కథను తనకు చెప్తాడు. దాంతో బాలామణి చాలా ఎగ్జైట్ అయిపోయి ఈ కథ బాగుంది. కానీ సినిమాకి సరిపోదేమో అని అంటాడు. ఇక ఈ క్రమంలోనే షఫీ ఈ సినిమాలోకి మరో మూడు కథల్ని ఆడ్ చేస్తాడు. అందులో రెండు బోల్డ్ కథలు కాగా, మరొకటి సమాజాన్ని మేలుకొలిపే కథ కావడం విశేషం…అయితే ఈ మూడు కథలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ‘విగ్నేష్ కార్తీక్’ ఎంచుకున్న ప్లాట్ పాయింట్ బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా ఆయన కథ ప్లాట్ ని రాసుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మొదటి నుంచి చివరి వరకు కూడా సినిమాను చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఎక్కడైతే అమ్మాయి అబ్బాయిల, అబ్బాయి అమ్మాయిలా మారతారు అనే ఒక చిన్న పాయింట్ ప్రేక్షకుడిని ఆటోమేటిగ్గా మొదటి నుంచి చివరి వరకు కట్టిపడేసే అంశం… ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే ని కనక మనం చూసుకున్నట్లైతే ఎప్పుడైతే మొదటి 15 నిమిషాలు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసి సినిమాని చూసే విధంగా చేస్తామో ఆటోమేటిగ్గా మిగతా సినిమా మొత్తాన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా చూడడానికి ఆసక్తి చూపిస్తాడు. ఇక ఇలాంటి కథ రాసుకోవడంలో విగ్నేష్ కార్తీక్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ కథలు మనం చూపించినప్పుడు దాన్ని ‘ఆంథాలజీస్’ అంటాం.. అంటే ఒకే సినిమాలో మల్టీపుల్ కథలను చెప్పడం. ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు చాలానే వచ్చినప్పటికీ కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని మాత్రం డిజాస్టర్ గా మిగిలాయి. ఇక ముఖ్యంగా విగ్నేష్ కార్తీక్ ఎంచుకున్న ఈ మూడు కథల్లో ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ను తీసుకొని అందులో ఎవరెవరు ఎలా సఫర్ అవుతున్నారు. ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా చాలా చక్కగా చూపించాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆయన కోర్ ఎమోషన్ మీద మరి కాస్త శ్రద్ధ పెట్టీ ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనే అభిప్రాయమైతే ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. నిజానికి ఈ మూడు కథల మధ్య ఇంటర్ లింక్ అనేది ఆయన చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాకి అది చాలా వరకు ప్లస్ అయింది. మూడు క్యారెక్టర్ల మధ్య నుండే ఆ కోర్ ఎమోషన్ ని మాత్రం ఇంకాస్త ఇంప్రూవ్ చేసినట్లయితే తప్పకుండా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అయ్యేది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్…

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా చాలా బాగా నటించి మెప్పించారు. ముఖ్యంగా విగ్నేష్ కార్తీక్ గాని, 96 ఫేమ్ గౌరీ జి కిషన్ లు పాత్రలో లీనమైపోయి నటించి సినిమా మొత్తాన్ని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ మార్చడంలో మాత్రం వీళ్లు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇక అమ్ము అభిరామ్, జనని, శాండి, సోఫియా లాంటి నటులు ఈ సినిమాలో చాలా వరకు ఎఫర్ట్ పెట్టి నటించారు…

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అనేది కొంతవరకు ప్లస్ అయినప్పటికీ, మ్యూజిక్ విషయం లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇక విజువల్స్ పరంగా సినిమా ఓకే అనిపించినప్పటికీ విజువల్స్ టాప్ నాచ్ లో అయితే లేవు… సినిమా కథ బాగుంది. కానీ టెక్నికల్ విషయాల్లో మాత్రం చాలా వరకు ఈ సినిమా అంత ఎఫెక్టివ్ గా లేదనే చెప్పాలి…

ప్లస్ పాయింట్స్

కథ
డైరెక్షన్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్

మైనస్ పాయింట్స్

టెక్నికల్ అంశాలు అంత ఎఫెక్టివ్ గా లేవు…
నరేషన్ ఇంకాస్త స్పీడాప్ చేసి ఉంటే బాగుండేది…

రేటింగ్

ఈ సినిమా కి మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్
కొత్త కథలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది…