Darling Re Release Collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘డార్లింగ్’ చిత్రాన్ని రీసెంట్ గానే గ్రాండ్ గా రీ రిలీజ్ చేయగా, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి ఆల్ టైం రికార్డు నమోదు అవ్వలేదు కానీ , మొదటి మూడు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ వసూళ్లను చూస్తే ఫుల్ రన్ ఆల్ టైం రికార్డు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం లో ఇప్పటికే ఈ చిత్రం ఆల్ టైం రికార్డు ని నమోదు చేసుకున్నట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 43 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు తర్వాత ఈ ప్రాంతం లో వసూళ్లు పెద్దగా నమోదు అవ్వకపోవడం గమనార్హం. క్లాస్ సినిమా అవ్వడంతో మాస్ ఆడియన్స్ ఉండే సీడెడ్ ప్రాంతం లో పెద్దగా వసూళ్లు రాలేదని అంటున్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 2 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. రెస్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ లో కూడా ఈ చిత్రానికి గ్రాస్ వసూళ్లు భారీగానే నమోదు అయ్యాయి.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 78 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు , ఓవర్సీస్ ప్రాంతం నుండి దాదాపుగా 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 7 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. నేటితో ఈ చిత్రం కచ్చితంగా ఖుషి సాధించిన 7 కోట్ల 71 లక్షల రూపాయిల గ్రాస్ మార్కుని దాటుతుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి అది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి.