Homeబిజినెస్Second Loan Eligibility: రెండో బ్యాంకు లోన్ తీసుకోవచ్చా.. అర్హతలు ఏంటి..

Second Loan Eligibility: రెండో బ్యాంకు లోన్ తీసుకోవచ్చా.. అర్హతలు ఏంటి..

Second Loan Eligibility: ప్రస్తుత కాలంలో బ్యాంకు లోన్ తప్పనిసరిగా మారింది. వివిధ అవసరాలకు ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్, బిజినెస్ లోన్ వంటివి తీసుకుంటున్నారు. అయితే ఆర్థిక అవసరాలకు ఈ లోన్ అవసరమైనప్పటికీ ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే లోన్ తీసుకున్న కూడా మరో లోన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేయాలి? అన్న సందేహం చాలామందికి వస్తుంది. ఇలాంటి సమయంలో ఒక లోన్ ఉండగా.. మరో లోన్ తీసుకుంటే వస్తుందా? రెండో లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ఏం చూస్తాయి? ఎవరికి మాత్రమే రెండో లోన్ ఇస్తాయి? అనే విషయాలపై పరిశీలిద్దాం..

బ్యాంకులు ఒకటికంటే ఎక్కువగా లోన్ ఇవ్వడానికి ఏమాత్రం అటు చెప్పవు. అయితే ఈ లోన్ ఇచ్చేటప్పుడు ఖాతాదారుడి ఆర్థిక వ్యవహారాలను బాగా పరిశీలిస్తారు. ముందుగా ఖాతాదారుడికి ఎటువంటి ఆదాయం వస్తుందో తెలుసుకొని.. ఆ ఆదాయంపై 35 నుంచి 40 శాతం వరకు ఈఎంఐ చెల్లించడానికి మాత్రమే అనుమతి ఇస్తారు. అంటే ఒక వ్యక్తికి లక్ష రూపాయల జీతం ఉంటే అందులో ఇప్పటివరకు రూ. 20వేల ఈఎంఐ తో లోన్ తీసుకుంటే.. మరో లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పటికే రూ. 50 వేల ఈఎంఐ చెల్లించే ఈఎంఐ ఉంటే మరో లోన్ ఇచ్చే అవకాశం ఉండదు.

అయితే ఒక ఖాతాదారుడికి ఇప్పటికే 15 లేదా 20% ఈఎంఐ తో లోన్ ఉన్నా కూడా మరో లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమయంలో ఖాతాదారుడి ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తారు. అంటే ఇప్పటివరకు తీసుకున్న లోన్ సక్రమంగా చెల్లిస్తున్నారా..? లేదా..? అనేది చూస్తారు. అలాగే ఆ ఖాతాదారుడు యొక్క సిబిల్ స్కోర్ పరిశీలిస్తారు. ఈ సిబిల్ స్కోర్ 750 నుంచి 800 వరకు ఉంటేనే లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని పరిశీలించుకొని రెండో లోన్ కోసం అప్లై చేయాలి.

కొన్ని అవసరాలకు రెండో బ్యాంకు రుణం తప్పనిసరి అయినా కూడా.. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లడం మంచిది. కొందరు ఆదాయం తక్కువగా ఉన్నా కూడా.. పరిమితికి మించి రుణాలు తీసుకుంటారు. ఇలాంటి సమయంలో ఆర్థిక భారం మీద పడి ఈఎంఐ లు మిస్ చేసుకుంటారు. నేటి కాలంలో ఒక్కసారి ఈఎంఐ మిస్ అయితే క్రెడిట్ స్కోర్ భారీగా పడిపోయే అవకాశం ఉంది. దీంతో ఆ తర్వాత వచ్చే రివార్డ్స్.. మరో బ్యాంకు రుణానికి ఆటంకాలు ఏర్పడతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular