Silver Loan: ప్రస్తుత కాలంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్కెట్లో బంగారం కొనాలంటే డబ్బు అందుబాటులో లేనివారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఉన్న గోల్డ్ ను విక్రయిస్తే మళ్లీ దొరకతనే భావన చాలామందిలో ఉంది. ఇలాంటి సమయంలో ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని కుదువ పెట్టి ఎంతోమంది లోన్ తీసుకుంటూ ఉన్నారు. బంగారం పై ఉన్న విలువపై 75% వరకు రుణాలు ఇస్తుంటారు. అయితే ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. మరి వెండి పై కూడా బ్యాంకు లోన్ తీసుకోవచ్చా.. వెండి ఆభరణాలపై ఎంతవరకు లోన్ ఇస్తారు..?
బంగారంపై ఇస్తున్నట్లుగానే వెండిపై కూడా బ్యాంకు లోన్ ఇస్తారు. అయితే వెండి పై 50 నుంచి 60 శాతం మాత్రం వరకే లోన్ ఇస్తారు. ఎందుకంటే బంగారం కంటే వెండి ధరలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా బంగారం కంటే వెండి విలువ తక్కువగా ఉంటుంది. దీంతో ఒక్కసారిగా వెండి ధరలు పడిపోతే తమకు నష్టం వస్తుందని భావనతో బ్యాంకులు తక్కువ శాతంతో రుణాలను మంజూరు చేస్తాయి. వెండి పై లోన్ ఇచ్చేటప్పుడు ఆభరణాల నాణ్యత కనీసం 99% ఉండాలి. అంతేకాకుండా ఇవి హాల్ మార్క్ ఆభరణాలు అయి ఉండాలి. ఏంటి ఆభరణాల్లో రాగి లేదా ఇతరులు కలిస్తే వీటిపై రుణం ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా ప్రతి వెండి వస్తువుపై రుణం ఇవ్వరు. కొన్ని రకాల వస్తువులకు మాత్రమే రుణ మంజూరు అవుతుంది. వాటిలో వెండి నాణేల బిస్కెట్లు, వెండి ఆభరణాలు, గొలుసులు వంటివి హాల్ మార్క్ కలిగే ఉండాలి. వీటిపై దాదాపు 50 నుంచి 60% వరకు రుణం పొందవచ్చు. అయితే వెండి పూజ సామాగ్రిపై లోన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీటి నాణ్యతను పరీక్షించడం కష్టంగా ఉంటుంది. వెండిపై రుణం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై తీసుకున్న రుణం బట్టి రేటు పర్సనల్ లోన్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ గోల్డ్ లోన్ కంటే ఎక్కువగానే ఉంటుంది. వెండిని పరీక్షించడానికి ప్రత్యేకంగా రుసుమును వసూలు చేస్తారు. ఒకవేళ వెండి నీ కుదుమ పెట్టి రుణం తీసుకున్నప్పుడు.. వెండి విలువ తగ్గితే.. అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.