https://oktelugu.com/

Lakshmi Devi: మీ ఇంటికి సిరిసంపదలు కలగాలంటే ఈ మాలతో లక్ష్మీదేవిని పూజించాలి?

Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి ఇల్లు, వారి జీవితం, వారి కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నిత్యం భక్తిశ్రద్ధలతో వారి ఇష్ట దైవాలను పూజిస్తూ ఉంటారు. కానీ మన ఇల్లు సిరిసంపదలతో తులతూగాలి అంటే తప్పనిసరిగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి. ఇలా అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో ఎంతో నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు. కానీ అమ్మవారి పూజలో భాగంగా అమ్మవారి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 21, 2021 / 02:40 PM IST
    Follow us on

    Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి ఇల్లు, వారి జీవితం, వారి కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నిత్యం భక్తిశ్రద్ధలతో వారి ఇష్ట దైవాలను పూజిస్తూ ఉంటారు. కానీ మన ఇల్లు సిరిసంపదలతో తులతూగాలి అంటే తప్పనిసరిగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి. ఇలా అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో ఎంతో నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు. కానీ అమ్మవారి పూజలో భాగంగా అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి సిరి సంపదలు కలగాలంటే తప్పనిసరిగా ఇలా పూజించాలి…

    Lakshmi Devi

    Also Read: కొత్త సంవత్సరంలో విజయాలు పొందాలంటే.. ఇవి పాటించాల్సిందే.. ఆచార్య చాణక్య!

    అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి మనకు అష్టైశ్వర్యాలు కలగాలంటే స్పటిక మాల ధరించి అమ్మవారికి పూజ చేయాలి. పురాణాల ప్రకారం స్పటిక మాల అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది కనుక స్పటిక మాల ధరించి పూజ చేయటం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. మంచు పర్వతాలపై మంచు స్పటిక రూపంలో కిందికి పడుతుంది. అలాంటి తెల్లని స్వచ్ఛమైన స్పటిక మాలతో అమ్మవారిని పూజించాలి.

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్పటికాన్ని మాల ధరించడం వల్ల మన గ్రహస్థితులు కూడా మారుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. స్పటిక మాల ధరించడం వల్ల కేవలం ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడమేకాకుండా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది.మీ ఇంట్లో పూజ గదిలో అమ్మవారి ఫోటోకు స్పటికమాల వేయడం వల్ల నిత్యం అమ్మవారి అనుగ్రహం మీ పై ఉంటుంది.

    Also Read: భార్యగా అత్తింట అడుగు పెట్టింది… ఇల్లు మొత్తం దోచుకుని పరారైంది!