Indian 2: ఇండియన్ 2 ఆడియో ఈవెంట్ ఎప్పుడో చెప్పేసిన కమలహాసన్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

శంకర్ కమలహాసన్ ను హీరోగా పెట్టి చేస్తున్న ఇండియన్ 2 సినిమా భారీ అంచనాల మధ్య షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక గ్లింప్స్ కూడా వదలని శంకర్...

Written By: Gopi, Updated On : May 20, 2024 2:45 pm

Kamal Haasan Indian 2 Pre-Release Event Details

Follow us on

Indian 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్… ఈయన చేసిన జెంటిల్ మెన్ సినిమా నుంచి చివరగా చేసిన రోబో 2.0 సినిమా వరకు ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కినవే కావడం విశేషం. గ్రాఫికల్ ఓరియంటెడ్ సినిమాలు చేయడంలో శంకర్ ను మించిన వారు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇలాంటి క్రమంలోనే శంకర్ కమలహాసన్ ను హీరోగా పెట్టి చేస్తున్న ఇండియన్ 2 సినిమా భారీ అంచనాల మధ్య షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక గ్లింప్స్ కూడా వదలని శంకర్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి పోస్టు ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే జూలైలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే జూన్ 1వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కమలహాసన్ ఇప్పటికే దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ఈవెంట్ కి సౌత్ లో ఉన్న చాలా మంది సినీ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యఅతిథిగా సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరోలు ఉన్నారు.

ఇక దాంతో పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పృధ్విరాజ్ సుకుమారన్ లాంటి దిగ్గజ నటులు కూడా ఈ ఈవెంట్ లో హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాని జులై నెలలో రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు. ఇంకా కమలహాసన్ కూడా ఈ సినిమా మీద మంచి అంచానాలైతే పెట్టుకున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది…