ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘సీత’గా పద్ధతి గల పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ బ్యూటీ మరీ తను అంత సంప్రదాయబద్దమైన అమ్మాయిని కాదని నిరూపించింది. తాజాగా బికినీ వేసుకొని ఈత కొలనులో ఈత కొడుతున్న ఒక ఫొటోను షేర్ చేసింది. బికినీలో హోయలు ఒలుకుతున్న ఆలియా భట్ అందాలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.
రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆలియా భట్ సీత పాత్రలో నటిస్తోంది. రామ్ చరణ్ పక్కన ఈ భామ పోషించనుంది. ఈమధ్యే ఈ భామకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇందులో చక్కడా అచ్చం సీతలా కనిపించి అటు మెగా ఫ్యాన్స్ ను ఇటు సినీ ప్రియులను అలరింపజేసింది.
తాజాగా ఆలియాభట్ బికీనీ డ్రెస్ లో కనిపించే సరికి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఓ స్విమ్మింగ్ ఫూల్ ఆమె చేపలా ఈదుతున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.‘స్టూడెంట్ ఆఫ్ ధి ఇయర్’ చిత్రంతో వెండితెరపై కనిపించిన ఆలియా ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బాలీవుడ్ హీరోయిన్ అనగానే ఎవరైనా కాస్తో కూస్తో అందంగా ఉంటుందనే భావన ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఆలియా భట్ మొదటి సినిమా నుంచే క్యూట్ గా ప్రేక్షకులను అలరిస్తోంది.
బాలీవుడ్ లో ఫేమస్ అయిన ఆలియా భట్ తెలుగులోకి ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి మహేశ్ భట్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతుండగా ఆమె కూతురు ఆలియా భట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరిగా ఉంటున్నారు.
ఆలియా భట్ స్విమ్మింగ్ ఫూల్ ఫొటోలను ఇప్పుడు తెగ షేర్లు చేస్తూ కుర్రకారు కామెంట్లు, లైక్ లతో హోరెత్తిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సీత ఇలా కనిపించడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.