Mahesh Babu-Rana: మహేష్ బాబు కోసం ఫైట్ డిజైన్ చేసిన రానా..? ఇంతకీ ఏ సినిమా లో అంటే..?

ఇక అందులో భాగంగానే కొంతమంది హీరోలు డిఫరెంట్ సబ్జెక్టులను ట్రై చేస్తుంటే మరి కొంతమంది మాత్రం రొటీన్ ఫార్ములా లోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు...

Written By: Gopi, Updated On : March 1, 2024 4:55 pm
Follow us on

Mahesh Babu-Rana: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులు అందరూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఒక్కో ఫ్యామిలీ నుంచి ఒక్కో హీరో స్టార్ హీరోగా ఉండటమే కాకుండా వరుస సినిమాలు చేస్తూ వాళ్ళ సినిమాలను సూపర్ సక్సెస్ చేసుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే కొంతమంది హీరోలు డిఫరెంట్ సబ్జెక్టులను ట్రై చేస్తుంటే మరి కొంతమంది మాత్రం రొటీన్ ఫార్ములా లోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు… ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సైనికుడు సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ లో వంతెన కూల్పోయే సీన్ ఒకటి ఉంది. ఇక ఆ సీన్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నా రానా(Rana) డిజైన్ చేశాడనే విషయం ఎవరికీ తెలియదు.

ఒకప్పుడు రానా విఫెఎక్స్ కి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉండేవాడు. తను సినిమాల్లోకి వచ్చే ముందు దాక కూడా గ్రాఫిక్స్ కు సంబంధించిన వర్క్ ని చేసి పెట్టే కాంట్రాక్టులు తీసుకొని చేస్తూ ఉండేవాడు. అలా సైనికుడు సినిమాలోని ఆ వంతెన కూలిపోయే సీన్ కి గ్రాఫిక్స్ చేశాడు… అదంతా న్యాచురల్ గా రానప్పటికీ అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆ లెవెల్లో అవుట్ పుట్ తీసుకురావడం కూడా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రానా కూడా హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మిగతా వాళ్ళ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక మంచి పేరు అయితే సంపాదించుకుంటున్నాడు…

ఇక ఇదిలా ఉంటే సైనికుడు సినిమాతో మహేష్ బాబు కి భారీ ఫ్లాప్ వచ్చిందనే చెప్పాలి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి రానా వర్క్ చేశాడు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది…ఇక రానా గుణశేఖర్ దర్శకత్వం లో రుద్రమదేవి సినిమాలో ఒక కీలక పాత్ర లో నటించాడు…