https://oktelugu.com/

Mileage Cars: అతి తక్కువ బడ్జెట్ లో మైలేజీ ఇచ్చే కార్లు

భారత ఆటో మొబైల్ మార్కెట్ లో అనేక సంస్థలకు చెందిన కార్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే సుమారు రూ.7 లక్షల వరకు ధర పలికే కార్లు టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి సంస్థలకు చెందినవే.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 1, 2024 / 04:57 PM IST

    Mileage Cars

    Follow us on

    Mileage Cars: ప్రస్తుత కాలంలో కార్ల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సాధారణ ప్రజలు కూడా తమ తమ బడ్జెట్ లో కార్లను కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఎక్కువ మైలేజీ ఇవ్వడంతో పాటు ఫీచర్లు అందుబాటులో ఉండి.. తక్కువ ధరలో దొరికే కార్ల కోసం అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలోనే సీఎన్జీ కార్లకు మార్కెట్ లో డిమాండ్ ఉంది.

    భారత ఆటో మొబైల్ మార్కెట్ లో అనేక సంస్థలకు చెందిన కార్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే సుమారు రూ.7 లక్షల వరకు ధర పలికే కార్లు టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి సంస్థలకు చెందినవే. ఎక్కువ మైలేజీతో రూ.7 లక్షల ధరలో మెరుగైన సీఎన్జీ కార్లు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. అవి ఏంటనేది మనం తెలుసుకుందాం.

    ముందుగా.. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్..రూ. 7 లక్షల వరకు బడ్జెట్ కేటాయించే వారికి ఈ కారు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక కిలో సీఎన్జీతో 34.05 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. వ్యాగన్ ఆర్ LXI CNG వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 6.45 లక్షలుగా ఉంది. VXI CNG వేరియంట్ ధర రూ.6.89 లక్షల వరకు ఉంది.

    మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో… మారుతి సుజుకి S-ప్రెస్సో కారు 1 కిలోల సీఎన్జీతో సుమారు 32.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. LXI CNG వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.92 లక్షలు. VXI CNG వేరియంట్ ధర రూ. 6.12 లక్షలుగా ఉంది.

    మారుతీ సుజుకి ఈకో… ఈకో మోడల్ ను కొనుగోలు చేయడానికి ఇష్టపడేవారికి ఇది బెస్ట్ కారు అని చెప్పుకోవచ్చు. మైలేజ్ కిలోకు 26.78 కి.మీ వరకు ఇస్తుండగా.. కారు 5-సీటర్ AC వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.58 లక్షలు పలుకుతుంది.

    తరువాత టాటా టియాగో… టాటా మోటార్స్ కు చెందిన టాటా టియాగో కూడా మెరుగైన మైలేజీని అందించడంతో పాటు రూ.7 లక్షల వరకు అందుబాటులో ఉంది. కారు కిలోగ్రాముకు 26.49 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా.. XI CNG ఎక్స్-షోరూమ్ ధర రూ.6.60 లక్షలుగా ఉంది.