https://oktelugu.com/

Upasana: ఉపాసన ఎన్టీఆర్ లకు మధ్య ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా?

ఎన్టీఆర్-రామ్ చరణ్ భార్య ఉపాసనల మధ్య ఉన్న కామన్ క్వాలిటీస్ కూడా బయటపడ్డాయి. నిజానికి ఎన్టీఆర్ ముక్కు సూటి మనిషి అంటారు. ఏది ఉన్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేస్తారనే టాక్ ఉంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 1, 2024 4:52 pm
    Upasana
    Follow us on

    Upasana: సినిమా ఇండస్ట్రీలో కొందరు జాన్ జిగిరి దోస్తులు ఉన్నారు. అందులో రామ్ చరణ్-ఎన్టీఆర్ లు కూడా ఒకరు. వీరిద్దరి స్నేహం గురించి ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉంటున్నారు. ఒకరి పార్టీకి మరొకరు వెళ్లకపోతే ఇతరుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. అయితే ఈ ఇద్దరి స్నేహం ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత పాపులర్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో వీళ్ల నిజమైన ఫ్రెండ్ షిప్ బయటపడింది.

    కాగా ఇదే క్రమంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ భార్య ఉపాసనల మధ్య ఉన్న కామన్ క్వాలిటీస్ కూడా బయటపడ్డాయి. నిజానికి ఎన్టీఆర్ ముక్కు సూటి మనిషి అంటారు. ఏది ఉన్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేస్తారనే టాక్ ఉంది. లోపల ఒకలా బయట ఒకలా ఉండరని.. అంటారు. అయితే ఇదే మనస్తత్వం రామ్ చరణ్ భార్య ఉపాసనకు కూడా ఉందట. కానీ రామ్ చరణ్ మాత్రం అలా కాదు.. ఏదైనా మాట్లాడితే ఎదుటి వారు హర్ట్ అవుతారేమో అని ఆలోచిస్తారట. అంతేకాదు ఆ అవసరమే వస్తే తనను తానే హర్ట్ చేసుకుంటారట.

    కానీ ఉపాసన మాత్రం అలా కాదు. ఎన్టీఆర్ మనసత్వం అలానే ఉంటుందట. తాను ఎవరి జోలికి పోదు. తన జోలికి వస్తే మాత్రం ఊరుకోదట. పిల్లలు కలగట్లేదు అని ఎన్ని సార్లు ఉపాసనను పరోక్షంగా సోషల్ మీడియా టార్చర్ చేసినా.. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంది. వారు అనుకున్న సమయానికే పిల్లలను కన్నారు.

    ఇక పలు సందర్భాల్లో కూడా ఉపాసన ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఉపాసన ఎన్టీఆర్ ల మధ్య ఉన్న ఈ కామన్ క్వాలిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయినా వీరు ఎవరిని ఏమనరు. ఏమన్నా అంటే ఊరుకోరు.. మా స్టార్లు గ్రేట్ అంటున్నారు ఈ ఇద్దరి అభిమానులు.