Homeఎంటర్టైన్మెంట్Dacoit vs LIK box office collections: 'డెకాయిట్' VS 'LIK'.. మొదటి రోజు ఓపెనింగ్...

Dacoit vs LIK box office collections: ‘డెకాయిట్’ VS ‘LIK’.. మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్ళలో పై చెయ్యి ఎవరిదంటే..

Dacoit vs LIK box office collections: నేడు బాక్స్ ఆఫీస్ వద్ద యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ‘డెకాయిట్’, ‘LIK’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది , కానీ ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రానికి మాత్రం ‘LIK’ తో పోలిస్తే కాస్త ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ‘LIK ‘ కంటే ‘డెకాయిట్’ కి బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా సిటీస్ లో ఈ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మామూలు రేంజ్ లో లేవు. ఒక్క హైదరాబాద్ లోనే మ్యాట్నీ షోస్ 150 కి పైగా ఫుల్స్ పడ్డాయి అంటే సాధారణమైన విషయం కాదు. మరో వైపు ‘LIK ‘ చిత్రానికి కూడా మంచి ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. కానీ అది కేవలం తమిళం లో మాత్రమే, తెలుగు లో మాత్రం ఈ చిత్రానికి డిజాస్టర్ ఓపెనింగ్ దక్కింది.

ప్రదీప్ రంగనాథన్ కి తమిళనాడు తో పాటుగా , తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన గత చిత్రం ‘డ్యూడ్’ కి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. కానీ ‘LIK ‘ కి అందులో పావు శాతం ఓపెనింగ్ కూడా వెచ్చేలా కనిపించడం లేదు. కారణం ఈ చిత్రం అనేక సార్లు వాయిదా పడడంతో, జనాల్లో ఆసక్తి పోయింది. అయినప్పటికీ ప్రదీప్ రంగనాథన్ అంటే యూత్ ఆడియన్స్ లో ఒక బ్రాండ్ కావడంతో , ఈ చిత్రానికి తమిళ వెర్షన్ వరకు మంచి ఓపెనింగ్ వసూళ్లు మామోడు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో ‘డెకాయిట్’ చిత్రానికి గంటకు 11 వేల టికెట్స్ అమ్ముడుపోతుండగా, ‘LIK’ చిత్రానికి గంటకు 9 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ టికెట్ సేల్స్ ఆధారంగా ఈ చిత్రానికి మొదటి రోజు ఎంత ఓపెనింగ్ వసూళ్లు నమోదు అవుతాయో చూద్దాం.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ చిత్రానికి 8 నుండి 10 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయట. ప్రదీప్ గత చిత్రం తో పోలిస్తే చాలా తక్కువ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఇక ‘డెకాయిట్’ విషయానికి వస్తే , ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 10 నుండి 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టీ ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఓవరాల్ గా ఈ రెండు సినిమాల్లో అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రం ఓపెనింగ్స్ లో పై చెయ్యి సాధించింది. మరి లాంగ్ రన్ లో ఏ సినిమా పై చెయ్యి సాధిస్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular