spot_img
HomeతెలంగాణChalukya history in Telangana: తెలంగాణలో చాళక్యులు అడుగు మోపిన గడ్డ.. బౌద్ధులకు ఇష్టమైన ప్రాంతం.....

Chalukya history in Telangana: తెలంగాణలో చాళక్యులు అడుగు మోపిన గడ్డ.. బౌద్ధులకు ఇష్టమైన ప్రాంతం.. ఆ విశేషాలు మీకోసం

Chalukya history in Telangana: చాళక్యులు.. ఈ పేరు వినిపిస్తే చాలు దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలలో వారు నిర్మించిన కట్టడాలు గుర్తుకు వస్తాయి. దక్షిణ భారత దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ చాళక్యుల ప్రభావం తక్కువే. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు వెలికి తీసిన చారిత్రక ఆధారాలలో చాళక్యుల పాత్ర కొంతమేర మాత్రమే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఓ ప్రాంతంలో చాళక్యుల ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వారు నిర్మించిన ఆధ్యాత్మిక ప్రాంతం.. దాని వెనుక ఉన్న వృత్తాంతం అటువంటిది.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి ప్రాంతంలో అత్యంత పురాతనమైన బౌద్ధ స్తూపం ఉంది. ఇది పూర్తిగా ఎర్ర మట్టితో కనిపిస్తూ ఉంటుంది. సుదూరం నుంచి చూసినప్పటికీ ఈ స్థూపం అత్యంత భారీగా కనిపిస్తూ ఉంటుంది.. బౌద్ధ మతాన్ని ఆచరించేవారు ఇక్కడికి వస్తుంటారు. టిబెట్, థాయిలాండ్, బ్యాంకాక్ వంటి దేశాలకు సంబంధించిన బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటారు. నేలకొండపల్లి సమీపంలో ఉన్న ఈ బౌద్ధ స్థూపానికి విశేషమైన చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఇది అత్యంత పెద్దదైన బౌద్ధ స్తూపం. ఇక్కడ చరిత్రకారులు తవ్వకాలు జరిగినప్పుడు మూడవ శతాబ్దం నాటి నాణాలు.. నిర్మాణశైలి బయటపడ్డాయి. నాడు బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఒక చెరువును తవ్వించినట్టు నాటి ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది.

ఖమ్మం జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ బౌద్ధ క్షేత్రం ఉంది. నేలకొండపల్లి మండల కేంద్రానికి కూత వేటు దూరంగా ఉంటుంది. మొదట్లో ఈ బౌద్ధకస్తుపాన్ని విరాట రాజు గద్దె అని పిలిచేవారు. స్థానికులు ఎర్ర మట్టి దిబ్బ అనేవారు. అప్పట్లో స్థానికులు తమ ఇంటి అవసరాలకు ఎర్రమట్టిని ఈ స్థూపం నుంచి తవ్వుకుని వెళ్లేవారు. 1974లో ఆర్కియాలజీ అధికారులు ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. మళ్లీ 1984లో తవ్వకాలు జరిపారు. అప్పుడు అది బౌద్ధ స్తూపం అని తేలింది. దక్షిణ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్తూపం అని అధికారులు గుర్తించారు. ఇండికా గ్రంథంలో కూడా ఈ పట్టణ విశిష్టత గురించి చరిత్రకారులు ప్రస్తావించారు.

ఇక్కడి బౌద్ధ స్తూపం 212 అడుగుల ఎత్తులో ఉంది. 54 అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దక్కన్ ప్రాంతంలో అతి పెద్దదైన స్థూపాలలో ఇది ఒకటి. ఇది మాత్రమే కాకుండా నేలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఇంకా అనేక రకాల చిన్నచిన్న స్థూపాలు ఉన్నాయి. ఈ స్తూపాన్ని చూసేందుకు భారీగా బౌద్ధ భిక్షువులు వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు కూడా వస్తుంటారు. అయితే పర్యాటకులకు సాంఖ్యక తగ్గట్టుగా ఇక్కడ సదుపాయాలు లేకపోవడంతో కొంతమేర నిరాశ ఎదురవుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper