Dacoit movie USA Premiere Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మంచి రోజులు వచ్చాయి. ధోనీ హెలికాప్టర్ షాట్ కొడితే సిక్స్ వెళ్ళినట్టు మనవాళ్లు చేసిన ప్రతి సినిమా సక్సెస్ లను సాధిస్తూ పాన్ ఇండియాలో టాప్ పొజిషన్ లో దూసుకెళ్తున్నారు… అడివి శేషు, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్ లో వచ్చిన డెకాయిట్ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ఆయన చేసిన సినిమాలన్నీ తనకు ఒక ఐడెంటిటిని క్రియేట్ చేయడమే కాకుండా ప్రేక్షకుల్లో ఒక నమ్మకాన్ని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. తన నుంచి వచ్చే ప్రతి సినిమా మినిమం గ్యారంటీగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ప్రేక్షకులైతే ఉన్నారు. డెకాయిట్ సినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకులు ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన యూఎస్ఏ ప్రీమియర్స్ అయితే వేశారు. అక్కడి ప్రీమియర్స్ ని బట్టి ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
కథ
అడవి శేషు, మృణాల్ ఠాకూర్ ఇద్దరు ప్రేమించుకుంటారు. తొందర్లోనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళకు వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళిద్దరూ ఒక దొంగతనం చేస్తారు. ఇక అందులో భాగంగానే వాళ్లు ఫైనల్ గా ఏం చేశారు.? పెళ్లి చేసుకున్నారా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమాని మొదటినుంచి చివరి వరకు దర్శకుడు చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు. ఎక్కడా కూడా ప్రేక్షకుడిని డివియెట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నప్పటికి సెకండాఫ్ మాత్రం చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ‘కన్నెపిట్టరో కన్నుకొట్టారో’ పాట మీద వచ్చే ఎపిసోడ్ అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సీక్వెన్స్ మొత్తం సినిమా మొత్తానికి చాలా హైలైట్ గా నిలిచాయని సినిమాను చూసిన యుఎస్ఏ ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలైతే తెలియజేస్తున్నారు…
అడివి శేషు ఇంతకుముందు సినిమాల్లో చేసినట్టుగానే ఈ సినిమాలో కూడా చాలా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడట. మృణాల్ ఠాకూర్ సైతం సరికొత్త క్యారెక్టర్ లో కనిపించిందని చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అడివి శేషు ఖాతాలో మరో సక్సెస్ దక్కినట్టుగా యూఎస్ఏ ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక పాన్ ఇండియాలో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…