Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer: యంగ్ హీరోయిన్ తో సుడిగాలి సుధీర్ ప్రేమాయణం.. ఇన్ స్టాగ్రామ్ స్టోరీ తో...

Sudigali Sudheer: యంగ్ హీరోయిన్ తో సుడిగాలి సుధీర్ ప్రేమాయణం.. ఇన్ స్టాగ్రామ్ స్టోరీ తో అడ్డంగా దొరికిపోయారుగా..

Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా అద్భుతమైన కమెడీ టైమింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకొని , నేడు సినిమాల్లో కూడా రాణిస్తున్న వారిలో ఒకరు సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer). ఈయనకు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో కొంతకాలం బుల్లితెర కి బ్రేక్ ఇచ్చాడు కానీ , ఇప్పుడు మళ్లీ ఆయన […]

Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా అద్భుతమైన కమెడీ టైమింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకొని , నేడు సినిమాల్లో కూడా రాణిస్తున్న వారిలో ఒకరు సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer). ఈయనకు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో కొంతకాలం బుల్లితెర కి బ్రేక్ ఇచ్చాడు కానీ , ఇప్పుడు మళ్లీ ఆయన వరుసగా గేమ్ షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ గా మారిపోయాడు. ఇదంతా పక్కన పెడితే సుధీర్ , రష్మీ జోడిగా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే . వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ ని చూసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంతా అనుకున్నారు. కానీ అది కేవలం కెమెరాల కోసం మాత్రమే అని అనేక సార్లు వీళ్లిద్దరు చెప్పినప్పటికీ ఆడియన్స్ నమ్మలేదు .

కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో నడుస్తుందని అనుకున్నారు. కానీ వాళ్ళు చెప్పిందే నిజం , వీళ్ళ మధ్య మంచి స్నేహం ఉంది కానీ, అంతకు మించిన బాండింగ్ లేదు. కానీ సుధీర్ మాత్రం ఒక యంగ్ హీరోయిన్ తో ప్రేమలో పడినట్టు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు , దీపికా పిల్లి. ఈమె కూడా ‘ఢీ’ అనే డ్యాన్స్ రియాలిటీ షో లో సుధీర్, ప్రదీప్, హైపర్ ఆది, రష్మీ లతో కలిసి ఎన్నో కామెడీ స్కిట్స్ చేసింది. ఆ తర్వాత పలు టీవీ షోస్ కి యాంకర్ గా కూడా చేసింది. ప్రస్తుతం జెమినీ టీవీ లో ప్రసారం అవుతున్న ‘మాస్ జాతర’ షో కి కూడా ఈమె హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా , ఈమె పలు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది.

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ..ఇక్కడ అబ్బాయి’ చిత్రం లో ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా, ఈ అమ్మాయి ఎవరో బాగానే ఉంది అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉండే దీపికా పిల్లి కాసేపటి క్రితమే ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ ని పెట్టి వెంటనే తొలగించింది. ఆ స్టోరీ లో సుడిగాలి సుధీర్ ని ఒక మంచి లొకేషన్ లో కలుస్తూ, మన కొత్త ప్రయాణం లాక్ అయ్యింది అనే విధంగా ఒక ఫోటో ని షేర్ చేసింది. ఆ ఫోటో ని మీరు క్రింది లింక్ లో చూడొచ్చు. చాలా రోజల నుండి రెడ్దిట్ యాప్ లో సుధీర్ , దీపికా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆమె స్టేటస్ ని పెట్టి వెంటనే తొలగించడం చూస్తుంటే నిజంగానే వీళ్ళ మధ్య రిలేషన్ ఉందని అంటున్నారు నెటిజెన్స్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో రాబోయే రోజుల్లో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper