Daaku Maharaaj Collection: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాక్ కి తగ్గట్టే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగా దక్కాయి. రెండవ రోజు, మూడవ రోజు కూడా ఓపెనింగ్ వసూళ్లు భారీగా వచ్చాయి. కానీ ఆ తర్వాత క్రమేణా వసూళ్లు బాగా తగ్గిపోయాయి. సినిమా మొత్తం మాస్ ఎలిమెంట్స్ ఉండడమే అందుకు కారణమా అంటే అవుననే చెప్పొచ్చు. ఒక సినిమాకి లాంగ్ రన్ ఉండాలంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు ఉండాల్సిందే. అది ‘డాకు మహారాజ్’ చిత్రానికి లేదు. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఏకపక్షంగా విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వైపే మొగ్గు చూపిస్తున్నారు. దాని ప్రభావం ‘డాకు మహారాజ్’ చిత్రం పై స్పష్టంగా పడడం మన కళ్లారా చూస్తున్నాము.
ఈ చిత్రం విడుదలై వారం రోజులు పూర్తి అయినా సందర్భంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూళ్లను రాబట్టింది?, ఫుల్ రన్ లో ఎంత వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి?, బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా?, అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము. నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి వసూళ్లు భారీ పడిపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజం లో 7వ రోజు డెఫిసిట్స్ వచ్చాయని తెలుస్తుంది. అంటే జీరో షేర్ అన్నమాట. మొత్తం మీద వారం రోజులకు కలిపి ఈ ప్రాంతంలో 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో 8.75 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 6.15 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్ల 60 లక్షలు, గుంటూరు జిల్లాలో 7 కోట్ల 20 లక్షలు,కృష్ణ జిల్లాలో 5 కోట్ల 15 లక్షలు, నెల్లూరు జిల్లాలో 3 కోట్ల 10 లక్షలు, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 56 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక+ ఓవర్సీస్ ప్రాంతాలు కలిపి 11 కోట్లు, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 67 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 80 కోట్ల రూపాయలకు జరగాలి. వచ్చే వారం మొత్తం మంచి థియేట్రికల్ రన్ వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే అది దాదాపుగా అసాధ్యం అనే అనుకోవాలి. చూడాలి మరి ఈ చిత్రం రేంజ్ ఎంత వరకు వెళ్తుందో. సంక్రాంతి సెలవుల్లో ఈ చిత్రం ఆడియన్స్ కి సెకండ్ ఛాయస్ గా మారడం అదృష్టం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ ని పక్కన పెట్టి ఆడియన్స్ ఈ సినిమాకి మొగ్గు చూపిస్తారని ఎవ్వరూ ఊహించలేదు.