IT News : ఉద్యోగం చేయాలని అనుకునేవారు ప్రముఖ సంస్థలో అవకాశం వస్తే విడిచిపెట్టరు. ఎందుకంటే ‘భారీ జీతం .. సకల సౌకర్యాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రతిభ ఆధారంగా ప్రమోషన్స్ వస్తుంటాయి. కాస్త కష్టపడితే కంపెనీ సీఈవో వరకు వెళ్లొచ్చు..’ ఇది మొన్నటి యువకుల మాట.. ‘జీతం తక్కువ.. బానిస బతుకు.. హైక్ అంతంత మాత్రమే.. కాస్త ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు..’ ఇది నేటి ఉద్యోగుల వాయిస్.. ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం అంటే ఎవరైనా హ్యీపీగా ఫీలవుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తాను 9 ఏళ్లు పనిచేసినా ఎలాంటి గ్రోత్ లేదని, పైగా తక్కువ జీతం వచ్చేదని అంటున్నాడు. అంతేకాకుండా బాధ్యతలు ఎక్కువగా పెరిగి మనసు భారంగా మారుతుందని చెబుతున్నాడు. తాజాగా ఆ యవకుడు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే?
GoatTop607 అనే ఐడీతో ఉన్న Reddit పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల కత్తిమీద సాములాగా ఫీలవుతున్నారు. ఓ వైపు తక్కువ జీతంతోనే కాలాన్ని వెళ్లదీస్తూ ఉండగా.. మరోవైపు బాధ్యతలు పెరిగి మానసికంగా ఒత్తిడిని కలిగి ఉంటున్నారు. అందుకు ఉదాహరణే ఈ యువకుడు పెట్టిన పోస్టు. ఈ పోస్టులో ఆయన పడిన బాధలను చెప్పాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన కంపెనీ మారిన తరువాత ఎక్కువ జీతం పొందడమే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పాడు.
ప్రముఖ ఐటీ కంపెనీ Infosis లో 2017లో ఈ యువకుడు ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆ తరువాత ప్రముఖంగా ఉన్న 4 కంపెనీల్లో చేరాడు. కానీ ఇన్ఫోసిస్ లో 7 సంవత్సరాల పాటు పనిచేసినా ఏమాత్రం జీతం అధికంగా కాలేదు. ఆ సమయంలో రూ.35 వేలు మాత్రమే తెచ్చుకున్నట్లు ఆ యువకుడు చెప్పాడు. వీటికి తోడు పార్కింగ్ ఫీజు, తదితర ఖర్చుల పేరిట డబ్బులు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు కంపెనీ మారిన తరువాత అసలు విషయం తెలిసింది. ఇది ప్రముఖ కంపెనీ కాకపోయినా మంచి జీతం. ఇన్పోసిన్ లో మానేసిన తరువాత ప్రస్తుతం రూ.1.7 లక్షలు అందుకుంటున్నట్లు చెప్పాడు.
ఈ యువకుడు పెట్టిన పోస్టుకు చాలా మంది స్పందిస్తున్నారు. కొందరు యువకులు పోస్టుకు లైక్ లు కొడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రతిభ ఉంటే జీతం పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. కానీ ఎక్కువ మంది మాత్రం కనీస వేతనం అమలు చేయాలని, అప్పుడే ఏ ఉద్యోగి అయినా ఎక్కువ పనిచేయడానికి ముందుకు వస్తారని అన్నారు.
మొత్తంగా ఈ యువకుడు చెప్పేదేంటంటే..? ప్రతీ ఉద్యోగికి కనీస వేతనం అమలు చేయాలి. వేజ్ బోర్డును అమలు చేయాలి. ఉద్యగ భద్రత అనేది అపోహ మాత్రమేనని, ఈ విషయంలో కొన్ని నిబంధనలు రావాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అంతేకాకుండా సాలరీ హైక్ విషయంలో ప్రముఖ కంపెనీలు 5 నుంచి 6 శాతం మాత్రమే అమలు చేస్తున్నాయి. ఇవి 15 నుంచి 30 శాతం వరకు ఉండాలని ఈ యువకుడు రాసుకొచ్చాడు.
Infosys – My 9 years experience of ‘unchained’ slavery
byu/GoatTop607 inbangalore