https://oktelugu.com/

Cyber Crime : అంత పెద్ద నటి తండ్రి.. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ.. గ్యాంగ్ చేతిలో 25 లక్షల మోసం

ఓడ ఎంత పెద్దదైనా చిన్నచిల్లు చాలు దానిని ముంచేయడానికి.. అలాగే ఎంత పెద్ద అధికారైనా.. చిన్న లొసుగుచాలు మోసపోవడానికి.. ఆ స్టార్ నటిమణి తండ్రి కూడా ఇలానే మోసపోయాడు. ముఠా చేతిలో 25 లక్షలు నష్టపోయాడు..

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2024 / 08:45 PM IST

    Disha Patani

    Follow us on

    Cyber Crime : బాలీవుడ్లో దిశా పఠానీ అనే ఓ నటిమణి ఉంది తెలుసు కదా.. ఇటీవల ప్రభాస్ సరసన కల్కి అనే చిత్రంలో కనిపించింది. సూర్య తో కంగువా అనే సినిమాలోనూ నటించింది. ఈమె తండ్రి పేరు జగదీష్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ లో బరేలి ప్రాంతంలో డిప్యూటీ ఎస్పీగా పని చేశారు. ఇటీవల రిటైర్ అయ్యారు. అయితే ఆయనను ఓ ఐదుగురు సభ్యుల ముఠా సంప్రదించింది. ప్రభుత్వ కమిషన్ లో హై బ్యాంకు పొజిషన్ ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పింది. దానికి మొదట్లో ఆయన నమ్మలేదు. అయితే ఆ గ్యాంగ్ సభ్యులు ఆయనకు లేనిపోని ఆశలు కల్పించడంతో నమ్మాల్సి వచ్చింది.. ప్రభుత్వ పెద్దలతో తమకు పరిచయాలు ఉన్నాయని ఆ గ్యాంగ్ సభ్యులు చెప్పడంతో ఆయన వారు చెప్పినట్టల్లా విన్నారు. 25 లక్షలు ఇచ్చారు. ప్రభుత్వ కమిషన్ లో హై ర్యాంక్ పొజిషన్ ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో ఆయన నమ్మి 25 లక్షలు ఇచ్చారు.. అయితే ఆ గ్యాంగ్ సభ్యులకు ఫోన్ చేసి పోస్టింగ్ గురించి అడిగితే దాటవేస్తూ వచ్చారు.. ఇటీవల వారు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ లో పెట్టారు. దీంతో జగదీష్ సింగ్ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    పోలీసులకు విచారణతో

    జగదీష్ సింగ్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు విచారణ సాగించగా.. ఆ గ్యాంగులో నలుగురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని తెలిసింది. శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్, ప్రీతి గార్గ్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు బరేలి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి.. డబ్బులు రికవరీ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇందులో శివేంద్ర ప్రతాప్ అనే వ్యక్తి దిశా పఠానీ తండ్రిని ఒక గ్యాంగ్ కు పరిచయం చేశాడట. అయితే వారు తమకు ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని ఆయనకు చెప్పారట. అందులో చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పోస్టులు ఇచ్చేలా చూస్తామని చెప్పడంతో దిశా తండ్రి నమ్మారు. ఎవరు చెప్పిన మాటలకు జగదీష్ కు నమ్మకం కలిగింది. దీంతో ఆయన ఆ గ్యాంగ్ చెప్పినట్టు 25 లక్షలు చెల్లించారు. నగదు రూపంలో ఐదు లక్షలను.. మిగతా నగదును వివిధ ఖాతాలకు జగదీష్ బదిలీ చేశారు. అయితే పోస్ట్ ఇవ్వకుంటే.. మూడు నెలల్లో వడ్డీతో సహా చెల్లించడానికి జగదీష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే జగదీష్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో.. ఆ గ్యాంగ్ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారు. చివరికి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో జగదీష్ తాను మోసపోయానని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. అందులో ఉన్న సభ్యులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. జగదీష్ కుమార్తె దిశ బాలీవుడ్ లో పేరుపొందిన నటి కావడంతో ఈ కేసు ఒకసారిగా హై ప్రొఫైల్ గా మారింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే జగదీష్ రిటైర్మెంట్ అయినప్పటికీ.. లంచమిచ్చి పోస్టింగ్ కోరుకోవడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.