https://oktelugu.com/

నాని ప్లాప్స్ కు కారణం అదేనట !

తెలుగులో మినిమమ్ గ్యారెంటీ హీరో ఎవరు అనగానే.. ముందుగా చెప్పుకునేది ‘నాని’ పేరే. నిర్మాతలు నానితో సినిమా చేయడానికి ముఖ్య కారణం, ఆ సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ వస్తాయని. పైగా నానితో సినిమా చేసి నిర్మాతలు రోడ్డున పడ్డ దాఖలాలు కూడా ఎప్పుడూ లేవు. బహుశా అదే నానిని స్టార్ ను చేసింది. కానీ, నాని టైం ప్రస్తుతం బాగాలేదు. ఈ మధ్య నాని సినిమాలు వరుసగా బాక్సఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 12, 2020 / 08:26 PM IST
    Follow us on


    తెలుగులో మినిమమ్ గ్యారెంటీ హీరో ఎవరు అనగానే.. ముందుగా చెప్పుకునేది ‘నాని’ పేరే. నిర్మాతలు నానితో సినిమా చేయడానికి ముఖ్య కారణం, ఆ సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ వస్తాయని. పైగా నానితో సినిమా చేసి నిర్మాతలు రోడ్డున పడ్డ దాఖలాలు కూడా ఎప్పుడూ లేవు. బహుశా అదే నానిని స్టార్ ను చేసింది. కానీ, నాని టైం ప్రస్తుతం బాగాలేదు. ఈ మధ్య నాని సినిమాలు వరుసగా బాక్సఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని, అభిమానులని అనుకున్నంతగా ఆకట్టుకోలేక ప్లాప్ సినిమాగానే మిగిలిపోయింది.

    Read More: ఇది విన్నారా.. రష్మికి పెళ్లి.. అది కూడా సుధీర్ తో..!

    భారీ అంచనాల మధ్య అమెజాన్ ప్రైమ్ లో విడుదలయిన ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం నాని కథ వినకుండానే ‘వి’ సినిమా చేశాడట. అంతకుముందు చేసిన ‘గ్యాంగ్ లీడర్’ కూడా కేవలం విక్రమ్ కుమార్ మీద ఉన్న నమ్మకంతోనే ఫుల్ స్క్రిప్ట్ కూడా వినకుండా ఆ సినిమా చేశాడట. మరి నిజంగానే నాని దర్శకుల మీద నమ్మకంతో కథ వినకుండా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే.. ఇలాగే వరుసగా ప్లాప్స్ నే వస్తాయి, కథల ఎంపికలో నానికి మంచి పట్టు ఉంది. ఒకవిధంగా దాని వల్లే నాని ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టి కథలతో పాటు ఫుల్ స్క్రిప్ట్ విన్నాకనే అది బాగా నచ్చిన తరువాతనే సినిమాకి అంగీకరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

    Read More: రియా పక్కింటి వ్యక్తికి సీబీఐ వార్నింగ్.. అసలేం జరిగింది?

    మరి ఇకనుంచైనా నాని పంథా మార్చుకుంటాడేమో చూడాలి. నాని ప్రస్తుతం టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారట. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.