తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఇప్పటివరకు ఉన్న సడలింపులు ఇతర అన్నింటిని తీసివేసి ఫ్రీ చేసేసింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని సమావేశంలో చర్చ జరిగింది. ఇవాళ్టి వరకు సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్, గంట సమయం వెసులుబాటు అంటే 6 గంటల వరకు లాక్ డౌన్ ఉండేది. రేపటి నుంచి అన్నీ ఫ్రీ ఉండనున్నాయి. అలాగే నైట్ కర్ఫ్యూ కూడా ఉండనుంది. అది కూడా ఈ రోజు రాత్రితో ముగియనుంది.
తెలంగాణలో లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ సమీక్షించారు. వైద్యఆరోగ్యశాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. మంత్రులు, పోలీస్ శాఖ అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ను ఎత్తివేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో మునుపటి మాదిరిగానే అన్ని కార్యకలాపాలు జరుగనున్నాయి.
రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించారు. తొలుత ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అత్యవసరం ఉన్నవారు పాస్ తీసుకోవాలని కోరారు.లాక్ డౌన్ ఎత్తివేతతో ఇక తెలంగాణలో మునుపటిలా అన్ని వ్యవహారాలు, పనులకు కార్యకలాపాలకు అనుమతిచ్చారు.
అన్నింటికంటే ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. కరోనాతో భారీగా దెబ్బపడిన సినిమా ఇండస్ట్రీని లేపాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి సినిమా థియేటర్లు తెలంగాణలో ఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు దాదాపు రెండు నెలలుగా మూసి ఉంటున్నాయి.కేసులు తగ్గడంతో ఓపెన్ చేసేందుకు సర్కార్ అనుమతిచ్చింది. దీంతో సినిమా పరిశ్రమకు కేసీఆర్ సర్కార్ గొప్ప ఊరటనిచ్చిందనే చెప్పాలి.
ఇప్పటికే కరోనా వల్ల చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేతతో థియేటర్లలో విడుదల కానున్నాయి. సిని పరిశ్రమకు ఊపిరిలూదినట్టు అయ్యింది.