https://oktelugu.com/

ఒకేసారి రెండు వ్యాక్సిన్లు.. ఏమైందంటే?

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ అత్యవసరం అవుతోంది. దీంతో ప్రజలు వైరస్ బారిన పడకుండా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలు తెగించి సేవలు చేస్తూ నలువైపుల నుంచి ప్రశంసలందుకుంటున్నారు. అయితే కొందరు సిబ్బంది మాత్రం నిర్లక్ష్య వైఖరితో ప్రజలను కొత్త సమస్యల్లోకి నెడుతున్నారు. బిహార్ లో మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో వ్యాక్సిన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ ఇలాంటి […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 19, 2021 / 04:43 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ అత్యవసరం అవుతోంది. దీంతో ప్రజలు వైరస్ బారిన పడకుండా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలు తెగించి సేవలు చేస్తూ నలువైపుల నుంచి ప్రశంసలందుకుంటున్నారు. అయితే కొందరు సిబ్బంది మాత్రం నిర్లక్ష్య వైఖరితో ప్రజలను కొత్త సమస్యల్లోకి నెడుతున్నారు.

    బిహార్ లో మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో వ్యాక్సిన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఓ యువతి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లింది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు నిర్లక్ష్యంగ వ్యవహరించి ఆ యువతి అనారోగ్యానికి కారణమైంది.

    ఫోన్లో మాట్లాడుతూనే ఆ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చింది నర్సు. దీంతో వ్యాక్సిన్ వేసుకున్న కాసేపటికి ఆ యువతి కళ్లు తిరిగి అక్కడే కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

    బిహార్ రాష్ర్టంలో మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని వువున్ బ్లాక్ టౌన్ కు చెందిన సునీలా దేవి అనే మహిళ వ్యాక్సినేషన్ కోసం కేంద్రానికి వెళ్లింది. వరుసలో నిలబడింది. ఆమె వంతు రాగానే వ్యాక్సినేషన్ తీసుకుంది. ఆ తరువాత అక్కడే కూర్చోవాలని చెప్పి సిబ్బంది చెప్పడంతో అక్కడే ఉంది. అనంతరం సిబ్బంది మరోసారి ఆమెకు టీకా వేసింది. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు డోసులు వేయడంతో వైద్యులు ఆమెను అబ్జర్వేషన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.