Prithviraj Sukumaran SSMB29 First Look: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో మహేష్ బాబుకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మూడు షెడ్యూల్స్ లో పాల్గొన్న మహేష్ బాబు రాజమౌళి చిత్రీకరించిన కీలక సన్నివేశాల్లో నటించాడు. ఇక రాజమౌళి సైతం మహేష్ బాబు ను చాలా స్ట్రాంగ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్న పృధ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను నిన్న రిలీజ్ చేశాడు. దానిమీద కొన్ని విమర్శలు వస్తున్నప్పటికి ఆ లుక్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒదిగిపోయాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: బండ్ల గణేష్ ఒక్క స్పీచ్ లో హీరోల కెరియర్ ఏంటో తేల్చేశాడుగా…ఆయన మాటల్లో వాస్తవం ఉందా..?
ఇక ఆయన లుక్ ను ఆ రేంజ్ లో డిజైన్ చేశాడు అంటే మహేష్ బాబు లుక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు… ఈనెల 15వ తేదీన రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఈవెంట్లో మహేష్ బాబు లుక్ ను చాలా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఈ ఈవెంట్ కి చాలామంది హీరోలు హాజరవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
లక్ష మంది అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ సక్సెస్ చేయడానికి రాజమౌళి తెగ ఆరాటపడుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి మహేష్ బాబు లుక్ మీద ఎలాంటి కేర్ తీసుకున్నాడు. తనను ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక రాజమౌళి తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది.
ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన పృథ్వీ రాజ్ సుకుమారన్ లుక్ క్రిష్ 3, 24 మూవీ నుంచి అలాగే ఫ్యామిలీ గై అనే యానిమేటెడ్ టీవీ సిరీస్ నుంచి కాపీ చేశాడు అంటూ చాలా విమర్శలైతే వస్తున్నాయి. మహేష్ లుక్ పరిస్థితి ఏంటి? అది రిలీజ్ అయ్యాక దాని మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి