Rashmika Mandanna: క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’కి బాలీవుడ్ లో రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లోకి టాప్ హీరోయిన్ గా దూసుకువచ్చేసిన ఈ బ్యూటీకి, అటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు వస్తున్నాయి. మొత్తానికి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ భారీ విజయంతో వచ్చిన జోరు కూడా ఈ కన్నడ భామకి బాగా కలిసి వచ్చింది. తాజాగా రష్మిక మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది.

తమిళ నెంబర్ వన్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుందట. మొదట మేకర్స్ పలువురు హీరోయిన్లను అనుకున్నా చివరకు రష్మికకే ఓటేశారని.. ఆల్ రెడీ ఆమెకు కథ కూడా చెప్పారని తెలుస్తోంది. అయితే, దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.
ఇప్పటికే రష్మిక సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ చిత్రంలోనూ అలాగే అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘గుడ్ బై’ సినిమాలోనూ రష్మిక నటిస్తోంది. ‘మిషన్ మజ్ను’ ఆల్ రెడీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రెండో సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. అలాగే రష్మికకు మాత్రం మరో బాలీవుడ్ సినిమా చేయమని ఆఫర్ వచ్చిందట. తాజాగా అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో మూడో సినిమా ఒప్పుకున్నట్లు హింట్ ఇచ్చింది రష్మిక. అయితే ఆమె చేస్తోన్న మూడో సినిమాలో హీరో ఎవరు, దర్శకుడు ఎవరు లాంటి సినిమా డీటెయిల్స్ గురించి ఏమి వెల్లడించలేదు.
Also Read: ప్చ్.. వివాదాల రాణి మళ్ళీ చెలరేగింది !

ఇంతకీ రష్మికకు వస్తోన్న హిందీ అవకాశాలు వెనుక ఉన్న కారణం సౌత్ మార్కెట్. రష్మికను తమ సినిమాలో పెట్టుకుంటే.. సౌత్ నుండి మార్కెట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. మొత్తానికి ఇటు తమిళంలో కూడా మొదటి ఆప్షన్ రష్మికనే కావడం విశేషం.
Also Read: జబర్ధస్త్ సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే?
[…] […]