https://oktelugu.com/

Budimpandu : ఆదిలాబాద్ లో మాత్రమే లభించి.. సువాసన వెదజల్లే ఈ పండు గురించి తెలుసా?

గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే పండు గురించి తెలుసుకోవాల్సిన అసవరం ఉంది. ఎందుకంటే ఇది ప్రకృతిలో ఎలాంటి నీరు, రసాయనాలు లేకుండా పండుతుంది. ఒకప్పుడు దీనితోనే కడుపు నింపుకునేవారని చెబుతారు. అయితే ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో దీనిని విక్రయిస్తున్నారు. ఇంతకీ ఈ ఫ్రూట్ పేరు ఏంటి? ఇది ఎలాంటి శక్తి ఇస్తుంది?

Written By:
  • Srinivas
  • , Updated On : September 22, 2024 / 01:58 PM IST

    Budimpandu

    Follow us on

    Budimpandu : నేటి కాలంలో ఆహారానికి కొరత లేదు. కాస్త డబ్బులుంటే టిఫిన్ సెంటర్ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ద్వారా కడుపు నింపుకోవచ్చు. కానీ పూర్వ కాలంలో ఇన్ని సౌకర్యాలు ఉండేవి కావు. ప్రకృతిలో లభించే పండ్లు, కాయలతోనే కడుపు నింపుకునేవారు. ముఖ్యంగా మారుమూలల్లో ఉండే కొన్ని గ్రామాల్లో అయితే ఆహారం కూడా సరిగా దొరికేది కాదు. ఈ నేపథ్యంలో ఎక్కువగా పండ్లపైనే ఆధారపడేవారు. అయితే కాలం మారుతున్న కొద్ది ఎక్కువగా ఆహారంపై ఆధారపడుతున్నారు. దీంతో కొన్ని పండ్ల గురించిన సమాచారం కనుమరుగైపోయింది. అయితే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే పండు గురించి తెలుసుకోవాల్సిన అసవరం ఉంది. ఎందుకంటే ఇది ప్రకృతిలో ఎలాంటి నీరు, రసాయనాలు లేకుండా పండుతుంది. ఒకప్పుడు దీనితోనే కడుపు నింపుకునేవారని చెబుతారు. అయితే ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో దీనిని విక్రయిస్తున్నారు. ఇంతకీ ఈ ఫ్రూట్ పేరు ఏంటి? ఇది ఎలాంటి శక్తి ఇస్తుంది?

    గిరిజన ప్రాంతాల్లో డ్రైవ్ చేసే సమయంలో రోడ్డుపక్కన కొందరు గిరిజనులు కొన్ని పండ్లను విక్రయిస్తుంటారు. ఇవి అచ్చంగా వాటర్ మిలన్ ను పోలి ఉంటాయి. కానీ ఇవి అవి కావు. వీటిని బుడింపండ్లు అని అంటారు. ఇవి పత్తి, జొన్న చేన్లలో ఎక్కువగా కాస్తుంటాయి. వీటిక ఎలాంటి నీరు అవసరం లేదు. అయితే పంటలకు అందించే నీరు ద్వారా ఇవి సేకరించుకుంటారు. అయితే ఏడాదికి మూడు నెలల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఆ తరువాత ఇవి దొరకవు. దీంతో ఈ సమయంలోనే వీరు వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. రోజంతా పనిచేసే కూలీలు ఒకప్పుడు దీనిని ఆహారంగా తీసుకునేవారు. ఇది తినడం వల్ల రోజంతా శక్తితో కూడుకొని ఉంటారు.

    బుడింపండును కోసిన తరువాత మంచి సువాసన వెదజల్లుతుంది. ఇందులో కాస్త పంచదార వేసుకొని తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.దీంతో ఇది తిన్న వారు ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఎలాంటి కేలరీలు లేకపోవడం వల్ల దీనితో ఉపయోగాలే ఎక్కువగా ఉంటాయి. ముందుగా పచ్చని రంగులో ఉన్న పండు ఆ తరువాత పసుపు రంగులోకి మారుతుంది. ఇలా పసుపు రంగులోకి మారిన తరువాత తినడం వల్ల రుచిగా ఉంటుంది.

    ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే ఎక్కువగా లభించే ఈ పంట ద్వారా గిరిజనులు ఉపాధి పొందుతారు. ఈ జిల్లాలో ప్రధాన రహదారుల వెంట వెళ్లిన వారు వీటిని చూడొచ్చు. ప్రస్తుత కాలంలో ఏ పండు తిన్నా రసాయనాలు కలిసి ఉంటున్నాయి. అయితే ఇటువైపు వెళ్లినప్పుడు ఇది తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయనాలు కలిసి ఉండవు. అంతేకాకుండా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫైబర్ అధికంగా లభించి ఆరోగ్యంగా ఉంటారు. బరువు ఎక్కువగా ఉన్న వారు దీనిని తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఆదిలాబాద్ లో అయితే దీనిని రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. కొందరు దీనిని ఇతర మార్కెట్లోకి తీసుకురావాలని కోరుతున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లోకి వస్తే ధర పెరిగే అవకాశం ఉంటుంది.