https://oktelugu.com/

Vijay Devarakonda: మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్​ ఎవరో తెలుసా?

Vijay Devarakonda: డైనమిక్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్​ కెరీర్​లో తొలి పాన్​ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు, ఇస్మార్ట్​ శంకర్​ వంటి సూపర్​ హిట్​ కొట్టిన పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రెస్టేజ్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్​తో ఎలాగైనా బాలీవుడ్​లో జెండా పాతేయాలని విజయ్​తో పాటు, పూరి కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 11:05 AM IST
    Follow us on

    Vijay Devarakonda: డైనమిక్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్​ కెరీర్​లో తొలి పాన్​ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు, ఇస్మార్ట్​ శంకర్​ వంటి సూపర్​ హిట్​ కొట్టిన పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రెస్టేజ్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్​తో ఎలాగైనా బాలీవుడ్​లో జెండా పాతేయాలని విజయ్​తో పాటు, పూరి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి.

    Vijay Devarakonda

    Also Read: హీరోగా ఎంట్రీ… మహేష్ ని వెంటాడిన భయం

    ఈ సినిమా పూర్తయిన తర్వాత.. విజయ్ తర్వాత సినమా ఎవరితో అన్న విషయంపై నెట్టించ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే లైగర్​ సినిమా తర్వాత టక్ జగదీశ్​ డైరక్టర్​తో కలిసి సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లైగర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. వీడీ సుకుమార్​ దర్శకత్వంరో సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటే,, శివ నిర్వాణ దర్శకత్వంలోనూ మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట విజయ్​. ప్రస్తుతం ఈ విషయంపైనా ఇండస్ట్రీలో హాట్​ టాపిక్​గా మారింది.

    లైగర్​ సినిమా సెప్టెంబరులోనే విడుదల కావాల్సింది.. కానీ, కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు.. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టనుంది. కాగా, చార్మి, కరణ్​ జోహార్​, పూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

    Also Read: “బాలయ్య బాలయ్య… ఇరగతీసావయ్యా అంటున్న కళ్యాణ్ రామ్…