https://oktelugu.com/

Navya Rao : ఇంస్టాగ్రామ్ లో మెస్సేజ్ లు, 8 నెలలుగా ఆ పని… సీరియల్ నటి నవ్య రావు క్రేజీ లవ్ స్టోరీ!

తెలుగు వాళ్ళ ఫుడ్ లో ముద్దపప్పు ఆవకాయ, పచ్చి పులుసు లాంటివి బాగా ఇష్టం అని తెలిపింది. తన హోమ్ టౌన్ ఫుడ్ కి ఇక్కడ ఫుడ్ కి చాలా తేడా ఉంటుందట. అయినప్పటికీ తాను చాలా హ్యాపీగా తినేస్తానని ఆమె అన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 24, 2024 / 05:14 PM IST

    Crazy love story of serial actress Navya Rao!

    Follow us on

    Navya Rao : సీరియల్ నటి నవ్య రావు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జీ తెలుగులో ప్రసారమైన ‘ ముత్యాల ముగ్గు ‘ సీరియల్ లో నందిక గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అద్భుతమైన విలనిజం పండిస్తూ మెప్పించింది. గత ఏడాది నవ్య తన ప్రియుడిని వివాహం చేసుకుంది. కాగా నవ్య రావు ప్రేమించి పెళ్లాడింది. తాజాగా నవ్య తన లవ్ స్టోరీ బయటపెట్టింది. తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

    నవ్య రావు మాట్లాడుతూ .. ఒకసారి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లగా అక్కడ మొదటిసారి ఆయన్ని కలిశాను. కామన్ ఫ్రెండ్ ద్వారా అలా పెళ్ళిలో ఫస్ట్ టైం అతనితో పరిచయమైంది. రెండు మూడు రోజుల తర్వాత ఇంస్టాగ్రామ్ లో అతను మెసేజ్ చేశాడు. సాధారణంగా నేను మెసేజ్ లకు రిప్లై ఇవ్వను. కానీ మేమిద్దరం కలిసి జీవించాలని ఉంది. అతని మెసేజ్ కి రిప్లై ఇచ్చాను. దీంతో నెమ్మదిగా మా మధ్య స్నేహం ఏర్పడింది అని నవ్య అన్నారు.

    దాదాపు 9 నెలలు ఇలాగే మెసేజ్ లు చేసుకుంటూ గడిపాము. 8 నెలల డేటింగ్ తర్వాత, 9 నెలలకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని తన క్రేజీ లవ్ స్టోరీ బయటపెట్టింది. తన భర్త పేరు వరుణ్ అని, ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని నవ్య వెల్లడించింది. సీరియల్స్ షూటింగ్ ఉన్నప్పుడు తన భర్తతో కలిసి హైదరాబాద్ లో ఉంటారట. ఖాళీ దొరికినప్పుడు బెంగుళూరికి వెళ్లిపోతానని తెలిపింది. పుట్టి పెరిగింది బెంగళూరు అయినప్పటికీ తెలుగు, కన్నడ భాషలను మాట్లాడగలదట.

    తెలుగు వాళ్ళ ఫుడ్ లో ముద్దపప్పు ఆవకాయ, పచ్చి పులుసు లాంటివి బాగా ఇష్టం అని తెలిపింది. తన హోమ్ టౌన్ ఫుడ్ కి ఇక్కడ ఫుడ్ కి చాలా తేడా ఉంటుందట. అయినప్పటికీ తాను చాలా హ్యాపీగా తినేస్తానని ఆమె అన్నారు. రోటి పచ్చళ్ళు, చికెన్ పచ్చడి కూడా చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నవ్య రావు జీ తెలుగులో ‘ నిండు నూరేళ్ళ సావాసం ‘సీరియల్ లో నెగిటివ్ రోల్ లో నటిస్తుంది.