Rakul Preet Singh: కెరటం అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్. అంతకుముందు మోడలింగ్ చేసింది. సినిమాల్లో తన అవకాశాన్ని పరీక్షించుకుంది.. అయితే కెరటం సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ.. 2013లో సందీప్ కిషన్ సరసన నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా తొలి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమె వెను తిరిగి చూడలేదు. రఫ్, కరెంట్ తీగ, లౌక్యం, పండగ చేస్కో, కిక్ -2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఇటీవల జాకీ బాగ్ భగ్నానీ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె చేతిలో భారతీయుడు -2, ఇంకా కొన్ని వెబ్ సిరీస్ లు ఉన్నాయి.
ప్రియుడితో పెళ్లి పూర్తయిన నేపథ్యంలో రకుల్ మళ్లీ తన కెరియర్ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కొన్ని కథలు వింటున్నది. ఇటీవల ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నది. ఎరుపు రంగు డ్రెస్ ధరించి హొయలు పోయింది. తన లో ఉన్న అందాన్ని మరోసారి ఆవిష్కరించింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్.. తన రీసెంట్ ఫోటోషూట్ తాలూకు చిత్రాలను అందులో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫోటోలో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడ సినిమాలకు దూరమవుతుందోనని రకుల్ అభిమానులు తెగ బాధపడిపోయారు. ఆమధ్య తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ఎక్స్ ద్వారా షేర్ చేసినప్పుడు చాలామంది తమ బాధను వ్యక్తం చేశారు. పెళ్లయిన కాకుండానే మళ్లీ రకుల్ తన సినీ ఫీల్డ్ కు సంబంధించిన పని మొదలు పెట్టింది. కొన్ని యాడ్స్ షూటింగ్లో పాల్గొంటున్నది. పనిలో పనిగా ఫోటోషూట్స్ కూడా చేస్తోంది. సో రకుల్ అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు. పెళ్లయినంత మాత్రాన ఆమె సినిమాకు దూరం కాలేదు. త్వరలో కొత్త ప్రాజెక్టుల ద్వారా అభిమానులను పలకరించనుంది.