https://oktelugu.com/

Pallavi Prashanth: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ… పల్లవి ప్రశాంత్ మొదటి సాయం ఎంతో తెలుసా?

ఇచ్చిన మాట ప్రకారం రూ. 35 లక్షలు పేద రైతులకు పల్లవి ప్రశాంత్ పంచాల్సి ఉంది. డిసెంబర్ 17న షో ముగియగా మూడు నెలలు గడుస్తుంది. పల్లవి ప్రశాంత్ టీవీ షోలతో, కంటెస్టెంట్స్ గెట్ టుగెదర్ పార్టీలతో బిజీ అయ్యాడు. నెలల గడుస్తున్నా ప్రైజ్ మనీ పంచే ఊసే ఎత్తడం లేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 15, 2024 / 12:20 PM IST

    Pallavi Prashanth

    Follow us on

    Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 వేదికగా అనేక సంచలనాలు నమోదు అయ్యాయి. ఒక సామాన్య రైతుబిడ్డ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఫినాలే అనంతరం జరిగిన అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. రెండు రోజుల అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. కాగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఒక హామీ ఇచ్చారు. ఒకవేళ తాను విన్నర్ అయితే… ప్రైజ్ మనీ తనలాంటి పేద రైతులకు పంచేస్తాను అన్నాడు. టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు ప్ ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ పొందాడు.

    ఇచ్చిన మాట ప్రకారం రూ. 35 లక్షలు పేద రైతులకు పల్లవి ప్రశాంత్ పంచాల్సి ఉంది. డిసెంబర్ 17న షో ముగియగా మూడు నెలలు గడుస్తుంది. పల్లవి ప్రశాంత్ టీవీ షోలతో, కంటెస్టెంట్స్ గెట్ టుగెదర్ పార్టీలతో బిజీ అయ్యాడు. నెలల గడుస్తున్నా ప్రైజ్ మనీ పంచే ఊసే ఎత్తడం లేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా పల్లవి ప్రశాంత్ మాట తప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. విమర్శల నేపథ్యంలో ప్రాణం పోయినా మాట తప్పేది లేదంటూ పల్లవి ప్రశాంత్ గతంలో ఒక పోస్ట్ పెట్టాడు.

    ఎట్టకేలకు పేద రైతులను ఆదుకునే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ మొదటి సహాయంగా ఓ కుటుంబానికి రూ. 1 లక్ష ఇచ్చారు. గజ్వేల్ సమీపంలో గల కొలుగూరు అనే గ్రామంలో ఒక పేద రైతు, అతని భార్య మరణించారు. దాంతో వారి పిల్లలు అనాథలు అయ్యారు. పేరెంట్స్ ని కోల్పోయిన ఆ పిల్లలను కలిసేందుకు పల్లవి ప్రశాంత్, శివాజీ, భోలే షావలి, ఆట సందీప్ ఆ ఊరికి వెళ్లారు. పల్లవి ప్రశాంత్ పిల్లల పేరిట లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు.

    అలాగే ఒక ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాడు. ఆట సందీప్ సైతం తన వంతు సహాయం చేశాడు. రూ. 25 వేలు పిల్లలకు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో పల్లవి ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రాణం పోయినా మాట తప్పను. సహాయం చేసిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటానని కామెంట్ చేశాడు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. టాక్స్ కటింగ్స్ పోను రూ. 16 లక్షలు పల్లవి ప్రశాంత్ కి వచ్చినట్లు సమాచారం. ఇవి మొత్తం అతడు పేద రైతులకు పంచాల్సి ఉంది.