Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి కెరీర్ ప్రమాదంలో పడింది. ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. బంగార్రాజు సినిమా తర్వాత కృతి శెట్టికి హిట్ లేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పరాజయం పొందాయి. ఆమె లేటెస్ట్ రిలీజ్ కస్టడీ కూడా నిరాశపరిచింది. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. నాగ చైతన్య కూడా బాగానే కష్టపడ్డాడు. ఫలితం మాత్రం దెబ్బేసింది.
ఒక హీరోయిన్ కి వరుసగా నాలుగు పరాజయాలంటే ఆత్మహత్యా సదృశ్యమే. టాలీవుడ్ మేకర్స్ కృతి పట్ల ఆసక్తి తగ్గించారు. ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక తెలుగు ప్రాజెక్ట్ శర్వానంద్ మూవీ. ఫస్ట్ టైం శర్వానంద్, కృతి శెట్టి జతకడుతున్నారు. ఈ మూవీ మీదే కృతి శెట్టి ఆశలు పెట్టుకుంది. అటు శర్వానంద్ కుడి ఫార్మ్ లో లేదు. ఆయన సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయిపోతుంది.
ప్లాప్స్ తో పాటు శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ కూడా కృతి కెరీర్ ని దెబ్బతీసింది. ప్రస్తుతం తెలుగులో శ్రీలీలదే హవా. అరడజనుకు పైగా చిత్రాల్లో ఆమె నటిస్తుంది. బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ ఆమె లిస్ట్ లో ఉన్నారు. నితిన్, రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ చిత్రాల్లో నటిస్తుంది. మరి శ్రీలీలకు పోటీ ఇవ్వాలంటే గ్లామర్ షో తప్పనిసరి అని కృతి నమ్ముతుంది.
ఇటీవల సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా టైట్ టాప్ లో యద అందాల విందు చేసింది. ఉబికి వస్తున్న పరువాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ చేసిన కృతి శెట్టి గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం ఊహించని పరిణామం. మరి మడిగట్టుకు కూర్చుంటే అవకాశాలు రావు. అందుకే ఈ యంగ్ బ్యూటీ ఆలస్యం చేయకుండా హిట్ ట్రాక్ ఎక్కాలి, అవకాశాలు పట్టేయాలని చూస్తుంది.
View this post on Instagram